Yuva Galam : యువ గ‌ళం జ‌న స్వ‌రం

భారీ ఎత్తున ప్ర‌జాద‌ర‌ణ

Yuva Galam : తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లో కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా ఏపీ స‌ర్కార్ పై, ప్ర‌త్యేకించి సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

లోకేష్ యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి స్పంద‌న లభిస్తోంది. తీవ్ర విమ‌ర్శ‌ల‌తో రెచ్చి పోతున్నారు నారా లోకేశ్. రాయ‌మ‌ల‌సీమ‌లో ప్ర‌స్తుతం నారా లోకేష్ యువ గ‌ళం(Yuva Galam) పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేప‌ట్టిన యాత్ర 124 రోజుల‌కు చేరుకుంది. మంగ‌ళ‌వారం 125వ రోజు.

గ‌తంలో ఏ నాయ‌కుడు తిర‌గ‌న‌న్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌టించారు నారా లోకేష్. ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల‌సీమ‌లో 52 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా నారా లోకేష్ 44 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌టించ‌డం విశేషం.

చిత్తూరు జిల్లాల్లో 14 నియోజ‌క‌వ‌ర్గాలు, అనంత‌పురం జిల్లాల్లో 9 నియోజ‌క‌వ‌ర్గాలు, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాల‌లో, ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 7 నియోజ‌క‌వ‌ర్గాల‌లో లోకేష్ పాద‌యాత్ర చేప‌ట్టారు. ఇప్ప‌టి దాకా పాద‌యాత్ర ద్వారా 1587 కిలోమీట‌ర్లు పూర్తి చేశారు. మొత్తం 108 మండ‌లాలు 943 గ్రామాల‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

Also Read : Anna Hazare : ‘అన్నా’ మౌనం దేశానికి ప్ర‌మాదం

 

Leave A Reply

Your Email Id will not be published!