West Zone DCP : గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితులు
ముగ్గురు మైనర్లు ఇద్దరు మేజర్లు
West Zone DCP : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కు సంబంధించి కీలక అంశాలు వెల్లడించారు వెస్ట్ జోన్ డీసీపీ(West Zone DCP) జోయల్ డేవిస్ స్పష్టం చేశారు.
నగరంలోని జూబ్లీహిల్స్ కు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మనుమడు ఉన్నాడన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
సీసీ కెమెరాల్లో అతను ఎక్కడా కనిపించ లేదని చెప్పారు. అన్నీ పరిశీలించిన తర్వాతే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందన్నారు జోయల్ డేవిస్(West Zone DCP). బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారని, అందుకే కేసు విచారణలో ఆలస్యం జరిగిందన్నారు.
మైనర్ బాలిక ఇంకా ఆ ఘటన నుంచి కోలుకోలేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకున్నాక ఈ ఘటనలో పాలు పంచుకున్న వారు ఉంటే తప్పక కేసు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం,
సభ్య సమాజానికి తీరని అవమానకరమన్నారు డీసీపీ. తండ్రిని తన వద్దకు పిలిపించుకుని ధైర్యం చెప్పామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను గుర్తించామని చెప్పారు.
ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని వెల్లడించారు. తండ్రి ఫిర్యాదు మేరకు బూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు డీసీపీ.బాధితురాలి చెప్పిన వివరాల మేరకు ఐదుగురిని గుర్తించామన్నారు.
ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని ఇంకా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు డీసీపీ. కాగా ఈ కేసులో ఒక ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు.
Also Read : బాలిక గ్యాంగ్ రేప్ కేసు పీఎస్ వద్ద ఉద్రిక్తత