PM Modi : హైదరాబాద్ అద్భుతమైన నగరం – మోదీ
ప్రశంసలతో ముంచెత్తిన ప్రధాన మంత్రి
PM Modi : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికైంది హైదరాబాద్. ఎక్కడ చూసినా కాషాయం కనిపిస్తోంది. మరో వైపు గులాబీ జెండాలు కూడా రెప రెప లాడుతున్నాయి. ఓ వైపు బీజేపీ ఇంకో వైపు టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
జెండాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల పాటు కొనసాగే సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు , పార్టీ చీఫ్, 18 రాష్ట్రాల సీఎంలు ఇక్కడ కొలువు తీరారు.
కొన్నేళ్ల తర్వాత బీజేపీ హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తోంది. దేశం మొత్తం ప్రస్తుతం హైదరాబాద్ వైపు చూస్తోంది. ఇంకో వైపు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఇక్కడికి విచ్చేశారు.
సీఎం కేసీఆర్ ఆయనను స్వయంగా ఆహ్వానించారు. సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి(PM Modi) గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో పాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిశీవ్ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లో కాలుమోపిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భాగ్యనగరం అద్భుతమైన నగరం అంటూ కితాబు ఇచ్చారు. ఈ నగరాన్ని చూస్తుంటే తనకు ముచ్చట వేసిందని తెలిపారు.
ఈ విషయాన్ని మోదీ(PM Modi) ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. మరో వైపు టీఆర్ఎస్ తమ పాలనకు ఇది నిదర్శనమని పేర్కొంటోంది. దేశానికే తమ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపింది.
టీ హబ్, వి హబ్, అగ్రి హబ్ తో దూసుకు పోతోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ బాట పట్టాయి. భారీ పెట్టుబడులు పెట్టాయి.
Also Read : దేశాన్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెట్టాలి