KTR Hyderabad Top : లైఫ్ సైన్స్ రంగంలో హైద‌రాబాద్ టాప్

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్

KTR Hyderabad Top : దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే లైఫ్ సైన్స్ రంగంలో హైద‌రాబాద్ టాప్ గా నిలిచింద‌న్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. ప్ర‌పంచ హ‌బ్ గా అవ‌త‌రించ‌డం ఖాయ‌మ‌న్నారు. వ‌ర‌ల్డ్ లో మొత్తం 10 టాప్ కంపెనీలు ఉంటే అందులో నాలుగు కంపెనీలు తెలంగాణ‌కు చెందిన‌వే ఉన్నాయ‌ని ఇది మ‌నంద‌రికీ గ‌ర్వ కార‌ణ‌మ‌న్నారు.

ఇవాళ దేశానికే తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. ఐటీ, లాజిస్టిక్ , లైఫ్ సైన్సెస్ , ఏరో స్పేస్, రాకెట్ల త‌యారీ, ఫార్మా రంగం , ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌కు నిల‌యంగా మారింద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్(KTR Hyderabad Top).

శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న బ‌యో ఏషియా 2023 స‌ద‌స్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మొత్తం 800 కు పైగా కంపెనీలు కొలువు తీరాయ‌ని ఇదంతా త‌మ ప్రభుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్లనేన‌ని పేర్కొన్నారు. అన్ని రంగాల‌లో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోంద‌ని చెప్పారు. ఇక క‌రోనా క‌ష్ట కాలంలో సైతం త‌మ రాష్ట్రం అగ్ర‌గామిగా నిలిచింద‌న్నారు కేటీఆర్(KTR).

ప్ర‌పంచంలో మూడింట ఒక వంతు టీకాల ఉత్ప‌త్తి ఒక్క తెలంగాణ‌లో త‌యార‌వుతున్నాయ‌ని ఇదంతా ప్ర‌భుత్వం సాధించిన ఘ‌న‌త‌గా చెప్పారు మంత్రి . ఇక దేశీయ ఔష‌ధ రంగానికి సంబంధించిన ఎగుమ‌తుల్లో భారీ ఎత్తున 50 శాతం మ‌న రాష్ట్రం నుంచే వాటా ఉంద‌ని ఇది మ‌న ఘ‌న‌తేన‌ని పేర్కొన్నారు కేటీఆర్. గ‌త ఏడు ఏళ్ల‌లోనే 3 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని చెప్పారు కేటీఆర్(KTR).

Also Read : అజ‌య్ బంగా నిబ‌ద్ద‌తకు నిద‌ర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!