Physics Wallah CEO : ఇంటి వాడైన ఫిజిక్స్ వాల్లా ఫౌండ‌ర్

శివానీ దూబేను పెళ్లి చేసుకున్న అలాఖ్ పాండే

Physics Wallah CEO : విద్యా రంగంలో మోస్ట్ పాపుల‌ర్ ఎడ్యూ టెక్ గా గుర్తింపు పొందిన ఫిజిక్స్ వాల్లా ఫౌండ‌ర్ అలాఖ్ ఫాండే ఓ ఇంటి వాడ‌య్యాడు. ఆయ‌న శివానీ దూబేను వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను పంచుకున్నారు. సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

వీరిద్ద‌రి పెళ్లి ఫిబ్ర‌వ‌రి 22న జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఎడ్ టెక్ యునికార్న్ కంపెనీ కింద ఫిజిక్స్ వాల్లాను(Physics Wallah CEO) స్థాపించాడు. దీనికి ప్ర‌స్తుతం అల‌ఖ్ పాండే సిఇఓగా కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం పెళ్లి జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత నూత‌న వ‌ధూవ‌రుల‌కు సంబంధించి ఫోటోల‌ను పంచుకున్నారు. ఇందుకు సంబంధించి అంద‌మైన క్యాప్ష‌న్ కూడా జ‌త చేశారు.

మేం గ‌త కొంత కాలం నుంచి క‌ల‌లతో స‌హ‌వాసం చేశాం. ఇద్ద‌రం ఒక‌రినొక‌రం అర్థం చేసుకున్నాం. క‌లిసి జీవించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. అందుకే కుటుంబీకులు, స్నేహితుల స‌మ‌క్షంలో ఒక్క‌ట‌య్యామ‌ని, త‌మ‌ను దీవించాలంటూ అలాఖ్ పాండే , శివానీ దూబే కోరారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ఫోటోలు ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కొద్ది సేప‌ట్లోనే వైర‌ల్ గా మారాయి.

వీరిద్ద‌రి వివాహం పూర్తి సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో జ‌రిగింది. శివానీ దూబే త‌న లెహంగా కోసం సాంప్ర‌దాయ ఎరుపు రంగు దుస్తులు ధ‌రించింది. వ‌రుడు లేత గోధుమ రంగు క‌లర్ షేర్వానీని ఎంచుకున్నారు. అల‌ఖ్ పాండే లాంగ్ నోట్ కూడా రాశారు. గ‌త ఏడేళ్లుగా ఇదే ప్ర‌యాణంలో ఉన్నా. విద్యార్థుల‌ను అంద‌రినీ పిలవ‌డం ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని అందుకే పిల‌వ లేద‌న్నారు.

Also Read : వ‌ర‌ల్డ్ బ్యాంక్ చీఫ్ గా అజ‌య్ బంగా

Leave A Reply

Your Email Id will not be published!