Ajay Banga : వ‌ర‌ల్డ్ బ్యాంక్ చీఫ్ గా అజ‌య్ బంగా

నామినేట్ చేసిన యుఎస్ చీఫ్ జో బైడెన్

Ajay Banga : ప్ర‌వాస భార‌తీయులు స‌త్తా చాటుతున్నారు. అమెరికాలో కీల‌క‌మైన పోస్టుల‌లో కొలువు తీరారు. తాజాగా మాజీ మాస్ట‌ర్ కార్డ్ సిఇఓగా ప‌ని చేసిన అజ‌య్ బంగాను(Ajay Banga) ప్ర‌పంచ బ్యాంకుకు నాయ‌క‌త్వం వ‌హించేందుకు యుఎస్ చీఫ్ జో బైడెన్ నామినేట్ చేశారు. అజ‌య్ బంగా వ‌య‌స్సు 63 ఏళ్లు. ఆయ‌న భార‌తీయ అమెరిక‌న్. ప్ర‌స్తుతం ఈక్విటీ సంస్థ జ‌న‌ర‌ల్ అట్లాంటిక్ లో వైస్ చైర్మ‌న్ గా ప‌ని చేస్తున్నారు. ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీంతో ఖాళీ అయిన కీల‌క ప‌ద‌విని అజ‌య్ బంగాకు క‌ట్ట‌బెట్టారు బైడెన్. దీంతో అజ‌య్ బంగా ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచారు. గురువారం జో బైడెన్ ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు సాధార‌ణంగా అమెరిక‌న్ అయితే అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌) నాయ‌కుడు యూరోపియ‌న్ కు చెందిన వారై ఉంటారు స‌ర్వ సాధార‌ణంగా. అమెరిక‌న్ల‌కు కాకుండా ప్ర‌వాస భార‌తీయుడైన అజ‌య్ బంగాను(Ajay Banga) ఎంపిక చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

ఇప్ప‌టికే వైట్ హౌస్ లో అత్య‌ధిక శాతం ఉన్న‌తాధికారులంతా కీల‌క పోస్టుల‌లో ప్ర‌వాస భార‌తీయులే కొలువు తీరారు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వాతావ‌ర‌ణ మార్పుల‌తో స‌హా మ‌న కాలంలోని అత్యంత , అత్య‌వ‌స‌ర స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌బ్లిక్ – ప్రైవేట్ వ‌న‌రుల‌ను స‌మీక‌రించ‌డంలో అజ‌య్ బంగాకు(Ajay Banga) అపార‌మైన అనుభ‌వం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత ప్ర‌పంచ బ్యాంక్ చీఫ్ ను గ‌త ప్రెసిడెంట్ ట్రంప్ నామినేట్ చేశారు.

Also Read : ప‌వ‌ర్డ్ న్యూస్ యాప్ ఆర్టి ఫ్యాక్ట్

Leave A Reply

Your Email Id will not be published!