HYDRA: జన్వాడ ఫాంహౌస్‌కు అనుమతుల్లేవ్.!
జన్వాడ ఫాంహౌస్‌కు అనుమతుల్లేవ్.!
HYDRA: ప్రాథమిక సమాచారం సేకరించిన అధికారులు బుల్కాపూర్ నాలా పరీవాహకంలో సర్వే పూర్తి జన్వాడ ఫాంహౌస్‌కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి అనుమతుల్లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అధీనంలో ఉండడం, బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించారని సమాచారం.
HYDRA…
ఈ ఫాంహౌస్‌ను మీర్జాగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో గ్రామపంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా గుర్తించారని తెలుస్తోంది. ఫాంహౌస్ యజమాని ఎన్.ఎస్.ఎల్.ఆర్.ప్రసాదరాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని అధికారులు సమాచారం. ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్దిరోజుల తర్వాత ఫాంహౌస్‌కు ఇంటి నంబర్ 4-5 కేటాయించి అసెస్‌మెంట్ చేశారు. ఫాంహౌస్ (జీప్లస్1) విస్తీర్ణం 362 గజాలని, 3,200 చదరపు అడుగుల్లో ఉందని గ్రామపంచాయతీ అధికారులు లెక్కలు వేసి.. ఏటా రూ.11 వేలు పన్ను చెల్లించాలని అసెస్‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జీవో నంబరు 111 పరిధిలో ఫాంహౌస్ ఉందని తెలిసినా.. దాన్ని వేరే యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్న భావనతో అప్పట్లో వారు పన్ను మాత్రమే విధించారు. ఆ మేరకు నిర్వాహకులు ఏటా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలతో సరిపోల్చి జన్వాడ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు గురువారం సర్వే పూర్తి చేశారు. ఉపగ్రహ చిత్రాలు, గ్రామపటాలను సరిపోల్చారు. నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా? లేదా? అని నిర్ధారించుకున్నాక రంగారెడ్డి కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు.
Also Read : KTR Letter : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్