Hyper Market MD : తెలంగాణ‌లో రూ. 3,500 కోట్లు

హైప‌ర్ ఎండీ యూసఫ్ అలీ

Hyper Market MD : హైప‌ర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ యూసఫ్ అలీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం ఆయ‌న తెలంగాణకు చెందిన ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. తాను దావోస్ లో కేటీఆర్ ను క‌లిశాన‌ని చెప్పారు.

Hyper Market MD Announce

రాష్ట్రం కోసం ఆయ‌న ఎంత‌గానో క‌ష్ట ప‌డుతున్నాడ‌ని పేర్కొన్నారు. పెట్టుబ‌డులు తీసుకు వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడ‌ని, ఆయ‌న‌ను చూసి తాను విస్తు పోయాన‌ని తెలిపారు. హైప‌ర్ మార్కెట్ ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించి ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం త‌మ హైప‌ర్ మార్కెట్ ను హైద‌రాబాద్ లో ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పారు యూస‌ఫ్ అలీ. ఇదే స‌మ‌యంలో రాబోయే మూడు సంవ‌త్స‌రాల కాలంలో రూ. 3,500 కోట్లు పెట్టుబ‌డులుగా పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. మంత్రి కేటీఆర్(Minister KTR) వ‌ల్ల‌నే ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌కు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాల‌కు చెందిన కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ లో కొలువు తీరాయి. ప్ర‌స్తుతం హైప‌ర్ మార్కెట్ ఎండీ ప్ర‌క‌ట‌నకు ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.

Also Read : Elon Musk : ఎలోన్ మ‌స్క్ ట్వీట్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!