Justice KM Joseph : హిందూ మ‌తం గొప్ప‌ది – జ‌స్టిస్ జోసెఫ్

న్యాయ‌మూర్తి సంచ‌ల‌న కామెంట్స్

Justice KM Joseph : సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కేఎం జోసెఫ్(Justice KM Joseph) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూ మ‌తం గొప్ప‌త‌నం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. నేను పుట్టుక‌తో క్రిష్టియ‌న్ ను. కానీ ఇప్ప‌టికీ తన‌కు హిందూ మ‌తం అంటే ఇష్ట‌ప‌డతాన‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలోని పురాత‌న‌, సాంస్కృతిక‌, మ‌త ప‌ర‌మ‌న ప్ర‌దేశాల‌కు అస‌లు పేర్ల‌ను పున‌రుద్ద‌రించేందుకు నామ‌క‌ర‌ణ క‌మిష‌న్ ను ఏర్పాటు చేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లైంది సుప్రీంకోర్టులో. ఈ పిటిష‌న్ పై విచారించింది ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్భంగా బెంచ్ లో భాగ‌మైన జ‌స్టిస్ కేఎం జోసెఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు హిందూ మ‌తం, దాని చ‌రిత్ర‌, పోక‌డ‌ల‌పై.

ఇక్క‌డ ఎవ‌రు గొప్ప ఎవ‌రు త‌క్కువ అన్న‌ది కాదు స‌మ‌స్య‌. పేర్లు మార్చినంత మాత్రాన చ‌రిత్ర మార‌దు. అలాగే ప్ర‌తి మ‌తంలో మంచి ఉంటుంది. దానిని స్వీక‌రించే మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండాలి. నేను క్రిష్టియ‌న్ అయినంత మాత్రాన వేరే మ‌తాన్ని కోరుకోవ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు. నేను అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తాను. ఎందుకంటే ప్ర‌తి మ‌తంలో మాన‌వాళికి మంచి చేయాల‌న్న సంక‌ల్పం క‌లిగి ఉంటుంద‌ని పేర్కొన్నారు జ‌స్టిస్ కేఎం జోసెఫ్.

రోడ్ల పేర్ల‌తో మ‌త పర‌మైన పూజ‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఎత్తి చూపారు. జ‌స్టిస్ బివి నాగ‌ర‌త్న‌తో కూడిన ధ‌ర్మాస‌నానికి నేతృత్వం వ‌హిస్తున్న జ‌స్టిస్ జోసెఫ్(Justice KM Joseph) ..మ‌తాన్ని కించ ప‌ర్చ‌కూడ‌ద‌ని తెలిపారు. ఈ మ‌తం గురించి గ‌ర్వ‌ప‌డాలి..కానీ ఎత్తి చూప కూడ‌ద‌న్నారు. వీలైతే డాక్ట‌ర్ ఎస్ . రాధాకృష్ణ‌న్ రాసిన పుస్తకాన్ని చ‌ద‌వండి అని సూచించారు. పిటిష‌న్ ను కొట్టేశారు.

Also Read : మాయివోస్టుల‌కు ఎమ్మెల్యే గొగోయ్ అండ

Leave A Reply

Your Email Id will not be published!