Shashi Tharoor : నేను ప్రమాదకరమైన నాయకుడిని కాను
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కామెంట్స్
Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రధానంగా ఆయన ఒక్కడే 137 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి బరిలో ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత ఆయన గెలుపు ఓటములు పార్టీలో సహజమని పేర్కొన్నారు. అంతే కాదు మాజీ చీఫ్ సోనియా గాంధీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శశి థరూర్(Shashi Tharoor) ఇప్పుడు పార్టీకి వ్యతిరేకమైన నాయకుడిగా ముద్ర పడ్డారు.
తన స్వంత రాష్ట్రం కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భయాందోళనకు గురైనట్లు తనకు తెలిసిందని తాను ప్రమాదకరమైన వ్యక్తిని కానని స్పష్టం చేశారు శశి థరూర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పార్టీ అన్నాక ప్రజాస్వామ్యం అనేది ఉండాలన్నారు.
ఎవరి అభిప్రాయాలు, ఆలోచనలు వారికి ఉంటాయని వాటిని బహిరంగంగా ప్రకటించే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేశారు శశి థరూర్. మంగళవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ.
ఇదిలా ఉండగా శశి థరూర్(Shashi Tharoor) కేరళలో సుడిగాలి పర్యటన చేయడం పార్టీలో కలకలం రేపింది. మరో వైపు శశి థరూర్ రాజకీయ పర్యటనగా భావిస్తుండడమే అనుమానాలకు తావిస్తోందన్నారు.
తాను ఎలాంటి రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదని మరోసారి స్పష్టం చేశారు శశి థరూర్. తాను ఎవరికీ భయపడనంటూ ప్రకటించారు.
Also Read : ఆప్ దే ఢిల్లీ బల్దియా – గోపాల్ రాయ్