Arvind Kejriwal : నేను ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో లేను

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమ‌వారం డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో క‌లిసి గుజ‌రాత్ కు చేరుకున్నారు.

త్వ‌ర‌లో ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పాగా వేసింది. మ‌రో వైపు ఆప్ విస్త‌రించే ప‌నిని త‌న భుజాల మీద‌కు వేసుకున్నారు కేజ్రీవాల్.

ఇదే స‌మ‌యంలో కేంద్రం ఉక్కు పాదం మోపుతోంది బీజేపీయేత‌ర రాష్ట్రాల‌పై. వాట‌న్నింటిని త‌ట్టుకుని ముందుకు వెళుతున్నారు కేజ్రీవాల్. తాము ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డం లేద‌ని ముందే చెప్పారు.

ఇదే స‌మ‌యంలో త‌మ‌కు చాన్స్ ఇస్తే విద్య‌, వైద్యం, ఉపాధి, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, వ్యవ‌సాయ రంగాల‌పై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు ఆప్ చీఫ్‌. ఇదే స‌మయ‌మంలో గ‌త 27 ఏళ్లుగా కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఏం చేసిందో ప్ర‌జ‌లు అడ‌గాల‌ని పిలుపునిచ్చారు.

జనాన్ని చైత‌న్య‌వంతం చేసే ప‌నిలో ప‌డ్డారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . ఇవాళ ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌ధాన మంత్రి రేసులో లేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా కేజ్రీవాల్ చేసిన ఈ కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ ను నెల‌లో సంద‌ర్శించ‌డం ఇది ఐదో సారి కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం మేం కేంద్రంతో, మోదీతో , అమిత్ షాతో పాటు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో పోటీ ప‌డుతున్నామ‌ని అన్నారు. అందుకే తాను పీఎం రేసులో లేన‌న్నారు.

Also Read : దిలీప్ ఘోష్ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!