P Chidambaram George Soros : జార్జ్ సోరోస్ తో ఏకీభవించను – చిదంబరం
మోదీ ప్రభుత్వం ఇలా ఉంటుందని తెలియదు
P Chidambaram George Soros : ప్రపంచ వ్యాపార దిగ్గజం జార్జ్ సోరోస్ భారత దేశం పట్ల , వ్యాపారవేత్త గౌతం అదానీ పై చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. దీనిపై అటు అధికారపక్షంతో పాటు ఇటు ప్రతిపక్షం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత దేశ అంతర్గత వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకున్నా అది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం(P Chidambaram George Soros).
పనిలో పనిగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జార్జ్ సోరోస్ తన పరిధి దాటి కామెంట్స్ చేయడాన్ని తప్పు పట్టారు. శనివారం పి. చిదంబరం తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. జార్జ్ సోరోస్ ను విస్మరించండి..నౌరియల్ రౌబినీని వినాలని సూచించారు.
అయితే జార్జ్ సోరోస్ చెప్పే చాలా విషయాలతో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు కేంద్ర మాజీ మంత్రి. ఇదిలా ఉండగా బిలియనీర్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అదానీని ఏకి పారేశారు. గతంలో ఆయన చెప్పిన విషయాలతో తాను విభేదిస్తున్నట్లు పేర్కొన్నారు పి. చిదంబరం. ప్రజాస్వామికంగా ఎన్నికైన సర్కార్ ను పడగొట్టే ఎలాంటి ప్రయత్నం ప్రస్తుతం జరగడం లేదని తెలుసుకోవాలన్నారు.
భారత ప్రభుత్వంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండ కూడదనేది 137 కోట్ల మంది భారతీయులు నిర్ణయిస్తారని, పాలకులు కాదని తెలుసుకుంటే మంచిదని అన్నారు పి. చిదంబరం.
Also Read : మోదీపై జైరాం రమేష్ కన్నెర్ర