Ashok Gehlot : నా చేతుల్లో ఏమీ లేదు – అశోక్ గెహ్లాట్
ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారంతే
Ashok Gehlot : రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. పార్టీకి సంబంధించి ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు సీఎం కుర్చీలో ఎవరు ఉండాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయట పడ్డాయి.
ఏఐసీసీ చీఫ్ ఎన్నిక కోసం బరిలో ఉన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). అయితే సీఎం పదవి వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దానిని ఎట్టి పరిస్థితుల్లో వదులు కునేందుకు ఒప్పు కోవడం లేదు. మరో వైపు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ గెహ్లాట్ పార్టీ చీఫ్ గా ఉండాలని కోరుకుంటున్నారు.
అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. అంతలోపు సీఎం పదవిపై ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 91 మంది ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సీఎం అశోక్ గెహ్లాట్ కు. మరో వైపు ఆయన పార్టీ పదవికి పోటీ చేస్తున్నందున తనకు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు సచిన్ పైలట్.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉంది. మొత్తం ఎపిసోడ్ పై స్పందించారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). తన చేతిలో ఏమీ లేదని స్పష్టం చేశారు. శాసనసభ్యులు కోపంగా ఉన్నారని అన్నారు. సచిన్ పైలట్ ను సీఎంగా ఎంపిక చేయడాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇదే విషయంపై పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అశోక్ గెహ్లాట్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విధేయులైన ఎమ్మెల్యేలంతా తాము సచిన్ పైలట్ ను ఒప్పుకోమని వీలైతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని బెదిరించడం కలకలం రేపింది.
Also Read : రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం