KC Narayana Gowda : సిద్ద‌రామ‌య్య అంటే గౌర‌వం – మంత్రి

కేసీ నారాయ‌ణ గౌడ షాకింగ్ కామెంట్స్

KC Narayana Gowda : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఆ రాష్ట్రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు, ప్ర‌స్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్న కేసీ నారాయ‌ణ గౌడ‌. మాజీ సీఎంను ఆకాశానికి ఎత్తేశారు. సిద్ద‌రామ‌య్య అంటే త‌న‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌ని చెప్పారు.

నా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది కోసం ఏకంగా రూ. 40 కోట్ల వ‌ర‌కు నిధులు తాను ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తిప‌క్షంలో ఉన్న సిద్ద‌రామ‌య్య‌ను ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాషాయ పార్టీకి చెందిన కీల‌క మంత్రి సానుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

రాష్ట్ర రాజ‌కీయాల‌లో పెను సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. తాను సిద్ద‌రామ‌య్య‌పై ఎలాంటి వ్య‌తిరేక కామెంట్స్ చేయాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు కేసీ నారాయ‌ణ గౌడ‌(KC Narayana Gowda). ఆయ‌న సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఎలాంటి వివ‌క్ష చూప‌లేద‌ని పేర్కొన్నారు. సీఎం బొమ్మైతో పాటు చాలా మంది సిద్ద‌రామ‌య్య‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. క‌ర్ణాట‌క‌లోని మాండ్యాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేసీ నారాయ‌ణ గౌడ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి సిద్ద‌రామ‌య్యను తాను ఎందుకు విమ‌ర్శించాలంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న నాకు నిధులు ఇచ్చార‌ని వెల్ల‌డించారు. ఆయ‌న అంటే త‌న‌కు అపార‌మైన గౌర‌వం కూడా ఉంద‌న్నారు నారాయ‌ణ గౌడ‌.

విచిత్రం ఏమిటంటే ప్ర‌తిపక్ష నేత‌ను మంత్రి పొగ‌డ‌టం కాషాయ శ్రేణుల‌ను విస్తు పోయేలా చేసింది.

Also Read : ఎన్డీఏ వైఫ‌ల్యం అందుకే బ‌హిష్క‌రించాం

Leave A Reply

Your Email Id will not be published!