Arvind Kejriwal : భ‌యం నా వంట్లో లేదు – సీఎం

అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి ఆదివారం విచార‌ణ‌కు హాజ‌రయ్యే కంటే ముందు సీఎం వీడియో విడుద‌ల చేశారు. తాను బెద‌రింపుల‌కు భ‌య‌ప‌డ‌న‌ని, అరెస్ట్ ల‌కు జంక బోనంటూ స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో కొలువు తీరిన బార‌తీయ జ‌న‌తా పార్టీ కావాల‌ని ప్ర‌శ్నించే వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపించారు.

త‌న‌ను సీబీఐ అరెస్ట్ చేయ‌బోతోందంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. జైల్లో పెట్ట‌డం ఖాయ‌మంటూ వారే చెబుతున్నార‌ని ఇలాంటి కామెంట్స్ ఈ దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేద‌న్నారు. తాను సీఎంగా కొలువు తీరాక ఢిల్లీకి అభివృద్ది ఎలా ఉంటుందో ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాన‌ని స్ప‌ష్టం చేశారు.

ద‌మ్ముంటే గ‌త 30 సంవ‌త్స‌రాల కాలంలో గుజ‌రాత్ ను ఏలిన బీజేపీ ఏం అభివృద్ది చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. వాళ్లు చేయ‌ని అభివృద్దిని కేవ‌లం 8 ఏళ్ల‌లో చేసి చూపించాన‌ని చెప్పారు. త‌న‌ను దించాల‌ని సీబీఐని బీజేపీ ఆదేశించిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను దేశ భ‌క్తుడిన‌ని ఎవ‌రికీ భ‌య‌ప‌న‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

Also Read : మోదీ ప్ర‌త్యేక‌మైన నాయ‌కుడు

Leave A Reply

Your Email Id will not be published!