T Padma Rao Goud : ఊపిరి ఉన్నంత దాకా ‘గులాబీ’ తోనే
పద్మారావు గౌడ్ సీరియస్ కామెంట్స్
T Padma Rao Goud : తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమంటూ స్పష్టం చేశారు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. తాను (T Padma Rao Goud) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో స్పందించారు. ఈ మేరకు పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆర్(CM KCR). ఆయన అడుగు జాడల్లోనే నడుస్తా. ఆయన ఏది చేబితే అది చేస్తా. ఏనాడూ పార్టీని అతిక్రమించలేదు. నేను ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోను. కానీ డ్యామేజ్ చేయాలని చూడడం మంచి పద్దతి కాదన్నారు. హైదరాబాద్ లో తన గురించి ఎవరిని అడిగినా చెబుతారని పేర్కొన్నారు.
పార్టీ అధినేత నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు అన్నాక ఒకరినొకరు కలుసుకుంటారని అంత మాత్రాన పార్టీని మారుతున్నానంటూ ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు. తనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య దోస్తానా ఉందన్నారు. ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో పక్క పక్కనే కూర్చునే వారమన్నారు.
ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన తాను ఎలా బీజేపీలో చేరుతారని అనుకుంటున్నారంటూ పద్మా రావు గౌడ్ ప్రశ్నించారు. ఇక నుంచి ఈ దుష్ప్రచారానికి ముగింపు పలకాలని, ఆరోగ్య కరమైన రాజకీయం చేయాలని సూచించారు.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గులాబీ దళంలోనే ఉంటానని స్పష్టం చేశారు. బూర నర్సయ్య గౌడ్ వెళ్లినంత మాత్రాన తనను కూడా లాగితే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : పవన్ కళ్యాణ్ పై ఇంత అరాచకమా