Manish Sisodia CBI : నాకు మెడిటేష‌న్ సెల్ కావాలి – సిసోడియా

తీహార్ జైలుకు వెళ్లాల‌ని ఆదేశం

Manish Sisodia Wants : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆప్ అగ్ర నేత‌, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా మార్చి 20 వ‌ర‌కు క‌స్ట‌డీ పొడిగించింది. ఈ సంద‌ర్భంగా కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కోర్టులో త‌న‌కు మెడిటేష‌న్ సెల్ కావాల‌ని(Manish Sisodia Wants) కోరారు.

ప్ర‌త్యేక కోర్టు తీహార్ జైలు నంబ‌ర్ 1కి త‌ర‌లించారు . సీబీఐ క‌స్ట‌డీ ముగియ‌డంతో ఇవాళ సిసోడియాను కోర్టులో హాజ‌రు ప‌రిచారు. సీబీఐ త‌దుప‌రి క‌స్ట‌డీని కోర‌లేద‌ని , అవ‌స‌ర‌మైతే దానిని త‌ర్వాత తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి ఎంకే నాగ్ పాల్ జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి పంపారు.

ఆప్ నేత వైద్య ప‌రీక్ష‌ల స‌మ‌యంలో సూచించిన మందుల‌ను తీసుకు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఒక జ‌త క‌ళ్ల‌ద్దాలు, డైరీ , పెన్ను, భ‌గ‌వ‌ద్గీత కాపీని తీసుకు వెళ్లేందుకు కూడా న్యాయ‌మూర్తి అనుమతించారు.

సిసోడియా(Manish Sisodia) త‌ర‌పు న్యాయ‌వాది కోరిన‌ట్టుగా ధ్యాన గ‌దిలో ఉంచాల‌నే అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని జైలు అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. ఆప్ నెంబ‌ర్ 2 బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసింది. గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 26న అరెస్ట్ చేసి ఐదు రోజుల పాటు సీబీఐ క‌స్ట‌డీకి పంపారు.

అనంత‌రం కోర్టు క‌స్ట‌డీని రెండు రోజులు పొడిగించింది. త‌దుప‌రి క‌స్ట‌డీని కోర‌క పోవ‌చ్చ‌ని సీబీఐ వ‌ర్గాలు ముందుగా తెలిపాయి. 51 ఏళ్ల సిసోడియా ఈ బెయిల్ పిటిష‌న్ లో సీబీఐ అధికారులు త‌న‌ను ప‌దే ప‌దే ప్ర‌శ్న‌లు అడుగుతున్నార‌ని , అది త‌న‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తోంద‌ని ఈ సంద‌ర్బంగా కోర్టుకు తెలిపారు. కేసులో అన్ని రిక‌వరీలు జ‌రిగాయ‌ని, కాబట్టి సిసోడియాను క‌స్ట‌డీలో ఉంచ‌డం వ‌ల్ల ఎలాంటి మార్పు జ‌ర‌గ‌ద‌న్నారు.

Also Read : నిరుద్యోగుల‌కు రూ. 2,500 పెన్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!