Kachcha Sudeep : పోటీ చేయను ప్రచారం చేస్తా – సుదీప్
స్పష్టం చేసిన నటుడు కిచ్చా
Kachcha Sudeep : కర్ణాటకలో సీన్ మారుతోంది. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో పడుతున్నాయి. ఈ తరుణంలో వలసలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో బుధవారం ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్(Kachcha Sudeep) సంచలన కామెంట్స్ చేశారు. తాను రాజకీయాలలో చేరడం లేదని కానీ భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు.
ఆయన సీఎం బస్వరాజ్ బొమ్మైతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం ఏం చెబితే తాను అది చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను తాను పూర్తిగా గౌరవిస్తానని చెప్పారు కిచ్చా సుదీప్. ఇవాళ ఇక్కడ కూర్చునేందుకు దానితో సంబంధం లేదన్నారు .
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తులకు తాను మద్దతు ఇస్తానని తెలిపారు. సీఎం బొమ్మైని ఆకాశానికి ఎత్తేశారు కిచ్చా సుదీప్(Kachcha Sudeep). ఆయన తనకు గాడ్ ఫాదర్ అంటూ కితాబు ఇచ్చారు. తాను సీఎంకు మద్దతు ఇస్తున్నానని ఆయన ఎవరి తరపున ప్రచారం చేయమంటే వారి తరపున ప్రచారం చేసేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు.
ఇదిలా ఉండగా కర్ణాటకలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఓట్ల లెక్కింపు చేస్తారు. అయితే బీజేపీ మరోసారి పవర్ లోకి వచ్చేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. మరో వైపు మోదీ, అమిత్ షా ఫుల్ ఫోకస్ పెట్టారు.
Also Read : రెస్టారెంట్ గా మారిన రానా ఇల్లు
