Rana Restaurant : రెస్టారెంట్ గా మారిన రానా ఇల్లు

20 ఏళ్లుగా ఇందులోనే నివాసం

Rana Restaurant : తెలుగు సినిమా రంగంలో పేరొందిన న‌టీ న‌టులు వివిధ వ్యాపారాల‌లో భాగ‌స్వాములుగా ఉన్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో హీరోగా పేరొందిన ద‌గ్గుబాటి రాణా సైతం మంచి అభిరుచి క‌లిగిన న‌టుడు కూడా. తాజాగా ద‌గ్గుబాటికి చెందిన పాత ఇల్లు ఇప్పుడు రెస్టారెంట్(Rana Restaurant) గా మారి పోయింది. ఇందుకు సంబంధించిన రెస్టారెంట్ వీడియోను ద‌గ్గుబాటి అశ్రిత పంచుకున్నారు. స్పెయిన్ లో నివ‌సిస్తున్నారు అశ్రిత‌.

ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ‌ర్ కూడా ఆమె. రాణా మేన‌మామ‌. ప్ర‌ముఖ న‌టుడు ద‌గ్గుబాటి వెంకటేష్ కూతురే ఈ అశ్రిత‌. త‌న యూట్యూబ్ ఛానెల‌లోని కొత్త వీడియోలో ఆమె హైద‌రాబాద్ లోని వారి పాత కుటుంబ ఇంటిని సంద‌ర్శించింది. ఇది ఇప్పుడు ఇంటీరియ‌ర్స్ తో అత్యంత ఆధునిక హంగుల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా రెస్టారెంట్ గా మార్చేశారు.

నేను 20 సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డ నివ‌సిస్తున్నాన‌ని తెలిపారు రాణా(Rana Restaurant). రెస్టారెంట్ గా మారిన త‌ర్వాత ఆ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించడం ఇదే తొలిసారి అని అశ్రిత చెప్పారు. కాలేజీలో చ‌దువుకున్న‌ప్పుడు త‌మ పాత ఇంటిని ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు. అద్భుత‌మైన క‌ళాఖండాలు కూడా అమ‌ర్చారు. రానా త‌న పాత గ‌ది వైపు చూపిస్తూ ఇంటి మొద‌టి అంత‌స్తు త‌న అంత‌స్తు అని గుర్తు చేసుకున్నారు. పిజ్ఞా ప్లేస్ గా మారి పోయిందంటూ పేర్కొన్నాడు రానా.

Also Read : సినీ తెర‌పై వెండి వెన్నెల‌

Leave A Reply

Your Email Id will not be published!