KTR Bandi Sanjay : ‘బండి’ ఏ టెస్టుకైనా సిద్దం – కేటీఆర్
అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని సవాల్
KTR Bandi Sanjay : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. గత కొంత కాలంగా బీజేపీ , బీఆర్ఎస్ మధ్య మాటలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్ పై.
డ్రగ్స్ దందాలో మంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కేటీఆర్. దమ్ముంటే తాను ఇక్కడే ఉంటానని , తాను ఎన్ని నమూనాలు ఇచ్చేందుకైనా సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. అవసరమని అనుకుంటే తన కిడ్నీ కూడా ఇస్తానని ప్రకటించారు.
డ్రగ్స్ కేసులో తాను తప్పని తేలితే బండి సంజయ్ నడి చౌరస్తాలో తాను చేసిన ఆరోపణలు తప్పని, తన చెప్పుతో కొట్టుకుంటారా అని సవాల్ విసిరారు. దమ్ముంటే ఎవరు వస్తారో రావాలని , తన నమూనాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు కేటీఆర్(KTR) . మాదక ద్రవ్యాలు తాను తీసుకుంటున్నట్లు పదే పదే ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
తాను ఎక్కడికీ వెళ్లనని వైద్యులను తీసుకు వచ్చి టెస్టులు చేయించు కోవచ్చని, తన శరీరం రెడీగా ఉందని చెప్పారు. తనకు నచ్చిన డాక్టర్లను తీసుకు రావాలని కూడా వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, తాను కూడా మోదీని కోరుతానని అన్నారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
Also Read : దమ్ముంటే ‘రాజన్న’కు నిధులు తీసుకు రా