ICC Rankings : టీ20లో భార‌త్ టెస్టులో ఆసిస్ వ‌న్డేలో కీవీస్

వార్షిక ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించిన ఐసీసీ

ICC Rankings  : ఎప్ప‌టి లాగే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అన్ని ఫార్మాట్ (ICC Rankings )ల‌కు సంబంధించి వార్షిక ర్యాంకింగ్స్ ను డిక్లేర్ చేసింది. టీ20 ఫార్మాట్ లో భార‌త జ‌ట్టు అగ్ర స్థానంలో నిలిచింది.

టెస్టు ఫార్మాట్ లో ఆస్ట్రేలియా త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇక వ‌న్డే ఫార్మాట్ లో న్యూజిలాండ్ టాప్ వ‌న్ లో ఉంది. గ‌త ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి పొట్టి ఫార్మాట్ లో టీమిండియా టాప్ లో ఉంది.

గ‌తంలో ఒక పాయింట్ తో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ను ఆధిక్యంలో ఉంచింది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య తేడా ఐదు పాయింట్లుగా ఉంది. కాగా వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా కంటే భార‌త్ 9 పాయింట్లు వెనుక‌బ‌డి ఉంది.

ఇదే స‌మ‌యంలో వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఎప్ప‌టి లాగే న్యూజిలాండ్ టాప్ లో నిలిచింది. రెండవ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కేవ‌లం పాయింట్ తేడాతో వెనుక‌బ‌డి ఉంది.

ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండ‌గా టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. కొత్త ర్యాంకింగ్ లు మే 2019 నుంచి పూర్త‌యిన అన్ని టీ20 సీరీస్ ల‌ను ప్ర‌తిబింబిస్తాయి.

మే 2021కి ముందు పూర్త‌యిన‌వి 50 శాతం, తదుప‌రి సీరీస్ లు 100 శాతం వెయిట్ తో ఉన్నాయ‌ని ఐసీసీ(ICC Rankings )ప్ర‌క‌టించింది. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో భార‌త్ 270 పాయింట్లో టాప్ లో ఉండ‌గా ఇంగ్లండ్ 265 పాయింట్ల‌తో 261 పాయింట్లతో పాకిస్తాన్ మొద‌టి మూడు స్థానాల్లో నిలిచింది.

Also Read : 29న అహ్మ‌దాబాద్ లో ఐపీఎల్ ఫైన‌ల్

Leave A Reply

Your Email Id will not be published!