ICC ODI World Cup Semis : సెమీస్ బెర్తులు ఖరారు
ఇండియా..కీవీస్..సఫారీ..ఆసిస్
ICC ODI World Cup Semis : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. ఎట్టకేలకు అంతా ఊహించనిట్టుగానే నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో రికార్డుల మోత మోగించిన రోహిత్ సేన ఆధ్వర్యంలోని భారత జట్టు టాప్ లో నిలిచింది పాయింట్ల పట్టికలో.
ICC ODI World Cup Semis Teams
టీమిండియాతో పాటు న్యూజిలాండ్ , సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా బరిలో నిలిచాయి. ఈ టోర్నీలో శ్రీలంక అత్యంత దారుణమైన ప్రదర్శన చేపట్టింది. ఇక ప్రధానంగా టోర్నీలో చెప్పుకోవాల్సిన జట్టు ఏదైనా ఉందంటే అది ఆఫ్గనిస్తాన్ జట్టు. ఆ టీమ్ అద్బుతాలు చేసింది.
విచిత్రం ఏమిటంటే వన్డే ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఆశించిన మేర ఆడలేక పోయింది. పసికూనలుగా భావించిన ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. విచిత్రం ఏమిటంటే శ్రీలంక ఆట తీరుతో విసిగి పోయిన శ్రీలంక ప్రభుత్వం ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేసింది.తాత్కాలిక చైర్మన్ గా మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ.
ఇక సెమీస్ పరంగా చూస్తే నవంబర్ 15న ఇండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. 16న ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా పోటీ పడనున్నాయి. మొత్తంగా సెమీస్ లో ఎవరు గెలిస్తే ఆ జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి.
Also Read : SA vs AFG ICC World Cup : సఫారీ దెబ్బ ఆఫ్గాన్ అబ్బా