ICC Women Odi Rankings : మెరిసిన మిథాలీ..మంథాన‌

ఐసీసీ విమెన్స్ ర్యాంకింగ్స్

ICC Women Odi Rankings : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంకింగ్స్ డిక్లేర్ చేసింది. స్టార్ ఇండియ‌న్ ప్లేయ‌ర్ స్మృతీ మంథాన 5వ ర్యాంకుతో స‌రి పెట్టుకోగా హైద‌రాబాదీ క్రికెట్ దిగ్గ‌జం మిథాలీ రాజ్ (ICC Women Odi Rankings)రెండో స్థానంలో నిలిచింది.

బౌల‌ర్ల‌లో భార‌త వెట‌ర‌న్ పేస‌ర్ ఝుల‌న్ గోస్వామి 727 పాయింట్ల‌తో రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఇక ఆసిస్ కు చెందిన జె్ జోనాస్సెన్స్ 773 పాయింట్లు సాధించి టాప్ లో చేరింది.

రెండు స్థానాలు దాటి ఎగ‌బాకింది మంథాన‌. ఎప్ప‌టి లాగే ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయ‌ర్ అలిస్సా హీలీ 742 పాయింట్ల‌తో అగ్ర స్థానంలో కొన‌సాగుతోంది.

ఆసిస్ కు చెందిన బెత్ మూనీ 719, అమీ సాట‌ర్త్ వైట్ 717 పాయింట్ల‌తో వ‌ర‌సుగా మూడు, నాల్గో స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్ తో జ‌రిగిన మూడు మ్యాచ్ ల సీరీస్ లో రెండ వ‌న్డేలో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్న ఎల్లీస్ పెర్రీ ఆల్ రౌండ‌ర్ల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది.

31 ఏళ్ల ఈ మ‌హిళా క్రికెట‌ర్ మెల్ బోర్న్ లో జ‌రిగిన మ్యాచ్ లో 64 బంతులలో 40 ప‌రుగులు చేసింది. అంతే కాకుండా 7 ఓవ‌ర్ల‌లో 12 ప‌రుగుల‌కు మూడు వికెట్లు తీసి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కించుకుంది.

దీంతో ఆమెకు 47 పాయింట్లు సంపాదించి టాప్ లో నిలిచింది. ఇక నాట్ స్కిప‌ర్ ను అధిగమించింది. భార‌త ప్లేయ‌ర్ దీప్తి శ‌ర్మ 299 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో కొన‌సాగుతుండ‌గా గోస్వామి 251 పాయింట్ల‌తో 10 వ ర్యాంకుతో స‌రి పెట్టుకుంది.

Also Read : కోట్లు ప‌లికిన స్టార్ ప్లేయ‌ర్లు

Leave A Reply

Your Email Id will not be published!