V Vaidyanathan : దాతృత్వమా క‌ల‌కాలం వ‌ర్ధిల్లుమా

సాయం చేయ‌డంలో సిఇఓ స్పెష‌ల్

V Vaidyanathan  : కార్పొరేట్ కల‌ల ప్ర‌పంచంలో మ‌నీనే జీవితం అనుకునే త‌రుణంలో ఆయ‌న త‌న‌కు ఉన్న సంప‌ద‌లో కొంత మొత్తాన్ని త‌న వ‌ద్ద ప‌ని చేస్తున్న వారికి పంచాడు.

సాయం చేయ‌డం కూడా ఓ వ్యాపారంగా మారి పోయింది ఈ లోకంలో. మోసం, ద‌గా, కుట్ర‌, ద్వేషం, మాఫియా ఇలా చెప్పుకుంటూ ఇదేనా కోరుకున్న భార‌తం అని అనుమానం రాక మాన‌దు.

ఈ దేశంలో కొంత మంది ప్ర‌చారానికి దూరంగా తమ ప‌నేదో తాము చేసుకుంటూ వెళుతున్నారు. అలాంటి వారిలో అజీమ్ ప్రేమ్ జీ, శివ నాడ‌ర్ , సుంద‌ర్ పిచాయ్ , ర‌త‌న్ టాటా. వారి జాబితాలోకి వ‌స్తారు మ‌రొక‌రు.

ఆయ‌నే వైద్య‌నాథ‌న్. ప్ర‌స్తుతం మ‌రోసారి ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆయ‌న చేసిన సాయం గొప్ప‌ది క‌నుక‌.

ప‌క్క‌న ఎవ‌రైనా అడిగితే ముందు వెనుకా ఆలోచించే మ‌నుషులు, ప్ర‌బుద్దులు ఉన్న కాలం ఇది. వైద్య‌నాథ‌న్ ఐడీఎఫ్‌సీ బ్యాంకు సిఇఓగా ప‌ని చేస్తున్నారు.

ఆయ‌న కొలువు తీరాక బ్యాంకు లాభాల్లోకి వెళ్లింది. 2024 దాకా ఆయ‌నే ఆ బ్యాంకుకు చీఫ్ గా ఉంటారు. త‌న కారు డ్రైవ‌ర్ మొదలుకొని ఇంట్లో, ఆఫీసులో ప‌ని చేసే స‌హాయ‌కుల‌కు రూ. 30 లక్ష‌లు విలువ చేసే షేర్ల‌ను కేటాయించారు.

విచిత్రం ఏమిటంటే ఈ బ్యాంకులో వైద్య నాథ‌న్ కు 3.7 శాతం వాటా ఉంది. తాను బ‌హుమ‌తిగా ఇచ్చిన షేర్ల‌తో వ‌చ్చే నిధుల‌తో ఇళ్లు లేదా ఏమైనా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు.

తాను చ‌దువుకునేందుకు రూ. 500 ఇచ్చిన టీచ‌ర్ ను కూడా గుర్తించి స‌న్మానించారు వైద్య‌నాథ‌న్(V Vaidyanathan ). ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మ‌రిచి పోని ఇలాంటి వారు ఈ దేశంలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంది క‌దూ.

Also Read : జియోకు ఎయిర్ టెల్ ఝ‌ల‌క్

1 Comment
  1. Dastagiri says

    Super sir

Leave A Reply

Your Email Id will not be published!