Putin Zelensky : ఒప్పుకుంటే యుద్దం ఆపేస్తాం

ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Putin Zelensky : ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. తాము విధించిన ష‌ర‌తుల‌కు ఉక్రెయిన్ గ‌నుక ఒప్పుకుంటే వెంట‌నే సైనిక చ‌ర్య‌ను నిలిపి వేస్తామంటూ వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్షంగా దాడులకు పాల్ప‌డుతోంది. వందలాది మంది నిరాశ్ర‌యులుగా మారారు. ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇజ్రాయిల్, ఫ్రాన్స్ , ఇండియా, చైనా దేశాలు ర‌ష్యా చీఫ్ పుతిన్ తో మాట్లాడాయి. ఇక మాన‌వ‌తా దృక్ఫ‌థంతో నిలిపి వేయాల‌ని వాటిక‌న్ సిటీ క్యాథ‌లిక్ చ‌ర్జ్ పోప్ ఫ్రాన్సిస్ కోరారు.

ఈ మేర‌కు ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే తాను మాస్కోకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక ఎంత మాత్రం ర‌ష్యా ద‌ళాలు ఊరుకోవ‌డం లేదు. ఇప్ప‌టికి ఇంకా ప‌లు దేశాల‌కు చెందిన వారంతా ఉక్రెయిన్ లో ఉండి పోయారు.

ఓ వైపు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ(Putin Zelensky) అంత‌మే త‌న పంతంగా ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు పుతిన్. ప్ర‌ధాన న‌గ‌రాల‌ను టార్గెట్ చేస్తూ బాంబుల మోత మోగిస్తున్నాయి.

ఇదే స‌మ‌యంలో తామేమీ త‌క్కువ కాదంటూ ఉక్రెయిన్ సైనికులు, ద‌ళాలు, సామాన్య పౌరులు సైతం క‌ద‌న రంగంలోకి దూకుతున్నారు.

నిన్న‌టి దాకా మౌనంగా ఉన్న నాటో ద‌ళాలు సైతం ఎంట‌ర్ అయ్యాయి. ఇంకో వైపు అమెరికా సైతం సై అంటోంది. కానీ ర‌ష్యా మాత్రం డోంట్ కేర్ అంటోంది.

ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ర‌ష్యా. వెంట‌నే బేష‌ర‌తుగా తాము నిర్దేశించిన డిమాండ్ల‌ను ఒప్పుకుంటే ఇప్ప‌టికిప్పుడు సైనిక చ‌ర్య‌ను నిలుపుద‌ల చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు పుతిన్.

Also Read : ర‌ష్యా ఏక‌ప‌క్ష దాడుల్ని ఆపండి ప్లీజ్

Leave A Reply

Your Email Id will not be published!