Satya Pal Malik : ఉపేక్షిస్తే దేశం మ‌ణిపూర్ అవుతుంది

హెచ్చ‌రించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్

Satya Pal Malik : జ‌మ్మూ – కాశ్మీర్ , మేఘాల‌య మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధాని మోదీని, భార‌తీయ జ‌న‌తా పార్టీని, కాషాయ సంస్థ‌ల‌పై నిప్పులు చెరిగారు. ఇలాగే మౌనంగా ఉంటే, రాబోయే రోజుల్లో మ‌రిన్ని దారుణాలు చూడాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ కొంత కాలం నుంచీ కేంద్రాన్ని నిల‌దీస్తున్నారు. మోదీని ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ రైతులకు అండ‌గా నిలిచారు. ఆపై మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇదిలా ఉండ‌గా బీజేపీని గ‌నుక రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌నుక ఓడించ‌క పోతే యావ‌త్ దేశ‌మంతా మ‌ణిపూర్ లా కాలిపోక తప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik) చేసిన ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న యూపీకి చెందిన నాయ‌కుడు. సోష‌లిస్టుల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందారు. జాట్ నాయ‌కుల‌లో కీల‌క‌మైన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ సామాజిక న్యాయం గురించి ప‌ట్టించు కోద‌ని ఆరోపించారు. అది కేవ‌లం అధికారం కోసం మాత్ర‌మే ప‌ని చేస్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ లో రాజ‌స్థాన్ లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు స‌త్య పాల్ మాలిక్. 50 రోజులుగా మ‌ణిపూర్ కాలిపోతుంటే ఎందుకు ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

Also Read : Antonio Gutterres : ప్ర‌పంచాన్ని ఏకం చేస్తున్న యోగా

 

Leave A Reply

Your Email Id will not be published!