Malla Reddy : పవర్ లోకి వస్తే ఐటీ రైడ్స్ ఉండవు
మంత్రి చామకూర మల్లారెడ్డి కామెంట్స్
Malla Reddy : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Malla Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసులపై పెద్ద ఎత్తున ఐటీ శాఖ ఆధ్వర్యంలో దాడులు చేపట్టింది. ఏకంగా రూ. 18.5 కోట్ల నగదుతో పాటు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
అంతే కాదు మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, కొడుకులు, అల్లుళ్లు, ఇతర కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల్లో ఏకంగా 15 కేజీల బంగారం కూడా పట్టుపడింది. మల్లారెడ్డితో పాటు ఇతర కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్న వారికి కూడా నోటీసులు జారీ చేసింది ఆదాయ పన్ను శాఖ.
దీనిపై మల్లారెడ్డి కేంద్ర సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని మండిపడ్డారు. ఇదే సమయంలో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత రాష్ట్ర సమితి పవర్ లోకి వస్తుందని, ఇక ఐటీ, సీబీఐ, ఈడీ , ఎన్ఐఏ దాడులు అంటూ ఉండవని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించు కోవచ్చని భరోసా ఇచ్చారు. ఎవరిపై వేధింపులు అంటూ ఉండవన్నారు. సంపాదించుకున్న వాళ్లు సొంతంగా పన్ను చెల్లించే విధంగా సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు రూల్స్ తీసుకు వస్తారని వెల్లడించారు చామకూర మల్లారెడ్డి.
ఇదిలా ఉండగా మరోసారి ఆయన సీఎం కేసీఆర్ ను వెనకేసుకు వచ్చారు. తన వెనుక సీఎం ఉన్నంత వరకు మోదీ, అమిత్ షా ఎవరూ , ఏ రైడ్స్ ఏమీ చేయలేవన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్ ను పీఎంగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు రాష్ట్ర మంత్రి.
Also Read : పవన్ కళ్యాణ్ వీకెండ్ లీడర్ – నాని