Ghulam Nabi Azad : మిస్సైల్స్ ప్రయోగిస్తే రైఫిల్ తో అడ్డుకున్నా
గులాం నబీ ఆజాద్ సంచలన కామెంట్స్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ట్రబుల్ షూటర్, కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాపై పార్టీ మిస్సైల్స్ ను ప్రయోగించింది.
నేను వాటిని రైఫిల్స్ తో వాటిని నాశనం చేశానని చెప్పారు. అయితే తాను బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి నట్లయితే ఏమి జరిగి ఉండేదని ప్రశ్నించారు గులాం నబీ ఆజాద్.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి విస్తు పోయేలా చేశారు. ఇదిలా ఉండగా ఆజాద్ మాత్రం దివంగత ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను పల్లెత్తు మాట అనలేదు.
అంతే కాదు ప్రస్తుత ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కూడా తన విమర్శలు, ఆరోపణల నుంచి మినహాయించారు. అయితే పనిలో పనిగా ఆజాద్ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
ఆయన వల్లనే పార్టీ నాశనమైందని ఆరోపించారు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ కోలుకోలేని రీతిలో పడి పోయిందన్నారు.
తాను ఎవరి మాట వినడని, ప్రత్యేకంగా సీనియర్లను పక్కన పెట్టాడంటూ మండిపడ్డారు. ఇదే క్రమంలో పార్టీలో చర్చలు, సంప్రదింపులు అంటూ ఉండేవని కానీ ఇప్పుడు వాటికి పుల్ స్టాప్ పెట్టారంటూ ధ్వజమెత్తారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad).
పార్టీకి చెందిన నాయకులు తనపై విమర్శలు సంధించినప్పుడల్లా తాను యుద్దం ప్రకటించానని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లోని భదర్వాలో జరిగిన కార్యక్రమంలో ఆజాద్ ప్రసంగించారు.
Also Read : అపూర్వ ఆదరణ అనూహ్య స్పందన