Indian Army Danger : పాక్ రెచ్చగొడితే భంగపాటు తప్పదు
హెచ్చరించిన అమెరికా సర్కార్
Indian Army Danger : పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఒకవేళ పాకిస్తాన్ గనుక పదే పదే భారత దేశాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమెరికా చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతోంది.
గతంలో భారత్ వేరు..ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఇండియా వేరు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం మోదీ సారథ్యంలో భారత్ గతంలో కంటే సైనిక బలగం ధీటుగా బదులు ఇచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
తాజాగా అమెరికా నివేదిక సమర్పించింది. ఈ రిపోర్టులో సంచలన అంశాలు ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ , భారత్ చైనా దేశాల మధ్య వివాదాలు మరింత పెరిగే అవకాశం(Indian Army Danger) ఉందని అమెరికా అంచనా వేసింది. అమెరికా ఇంటెలిజెన్స్ చట్ట సభ సభ్యులకు తెలిపింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సైనిక బలగం ధీటుగా బదులు ఇస్తుందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది అమెరికా నివేదిక.
ఈ అంచనా యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ వార్షిక అంచనాలో భాగంగా ఉంది. దీనిని కాంగ్రెస్ విచారణ సమయంలో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం యుఎస్ కాంగ్రెస్ కు సమర్పించింది.
భారత్ , చైనా దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాకిస్తాన్ కు భరోసా ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొంది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉపద్రవం ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది అమెరికా. దీంతో పాకిస్తాన్ కు భంగపాటు తప్పదని అర్థమయ్యేలా హెచ్చరించడం కలకలం రేపింది.
Also Read : మోదీ ఆంటోనీకి ఘన స్వాగతం