MLC Kavitha : దమ్ముంటే రండి జైళ్లో పెట్టండి – కవిత
ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని ఫైర్
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన ప్రమేయం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొనడంపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కేంద్రాన్ని, పీఎం మోదీని టార్గెట్ చేశారు. ముందు మోదీ వస్తారని, ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగుతుందని ఎద్దేవా చేశారు.
బీజేపీ దేశంలో కొలువు తీరాక 9 రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చారంటూ ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు కవిత. ఏ దర్యాప్తు సంస్థ అయినా రావచ్చని, విచారణకు తాను సహకరిస్తానని స్పష్టం చేశారు. కావాలని ఆడుతున్న నాటకం తప్ప ఇంకొకటి కాదన్నారు.
ఇదంతా పథకం ప్రకారం చేస్తున్న నిరాధారమైన ఆరోపణలుగా కొట్టి పారేశారు. తాను ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ లేదన్నారు.
తెలంగాణ సమాజం సిగ్గు పడే విధంగా తాము ప్రవర్తించ బోమన్నారు. కావాలని సీఎం కేసీఆర్ ను ఇరికించేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. కావాలని తనను జైల్లో పెట్టాలని అనుకుంటే సిద్దంగా ఉన్నానని చెప్పారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha).
ప్రజలు తమ వైపు ఉన్నారని, జనం బలం ముందు ఎవరూ నిలబడ లేరన్నారు. కేంద్రంలో పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా వేధింపులకు గురి చేస్తామంటే ఊరుకోబోమన్నారు. మీడియాకు లీకులు ఇచ్చి తమకు ఉన్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తే ఎవరూ క్షమించరన్నారు కవిత.
ఈడీ, సీబీఐలతో బీజేపీ గెలవాలని అనుకుంటోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కవిత.
Also Read : లిక్కర్ స్కాం అబద్దం విచారణకు సిద్దం – కవిత