Navneet Rana : ఖలేజా ఉంటే నాపై పోటీకి దిగు
మరాఠా సీఎంకు నవనీత్ సవాల్
Navneet Rana : అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్(Navneet Rana) సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మరాఠా సీఎం ఉద్దవ్ థాకరేను టార్గెట్ చేశారు. దమ్ము లేదా ఖలేజా ఉంటే ఒంటరిగా నాపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు.
ఇదే సమయంలో ఆమె ఉద్దవ్ థాకరేకు చాన్స్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా పర్వాలేదని తాను ఆయనపై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఎంపీగా చేసినా లేదా ఎంపీగా చేసినా తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు నవనీత్ కౌర్ రాణా. తాను ఎలాంటి తప్పు చేయలేదని అయినా ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీశారు.
దేశంలో ఒక తీరు ఉంది. కానీ మరాఠాలో ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ నిప్పులు చెరిగారు. పవిత్రమైన హనుమాన్ చాలీసా చదవడం తప్పా అని నిలదీశారు.
ఒక వేళ చాలీసా చదవడం నేరమైతే తాను 14 రోజులు కాదు 14 ఏళ్లు అయినా జైలుకు వెళ్లేందుకు సిద్దమని ప్రకటించారు. లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఎంపీ నవనీత్ కౌర్ రాణా(Navneet Rana) మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇల్లు మాతృశ్రీ ఇంటి వెలుపల హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవి రాణాలను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిద్దరిని కోర్టు ముందు హాజరు పరిచారు. వారికి 14 రోజుల పాటు కస్టడీ విధించింది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. 12 రోజుల పాటు జైలులో గడిపారు. ఆ తర్వాత విడుదల చేశారు.
Also Read : బీహార్ పై మాట్లాడే హక్కు పీకేకు లేదు