Bandi Sanjay : ద‌మ్ముంటే సీబీఐతో విచార‌ణ చేప‌ట్టండి

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ డిమాండ్

Bandi Sanjay : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌ల వేడి మ‌రింత కుంప‌ట్లు రాజేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతానికి బ‌రిలో ఎంద‌రున్నా ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే న‌డుస్తోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ మ‌రింత వేడిని ర‌గిలిస్తున్నారు.

ఈ త‌రుణంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేగింది న‌లుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం. దీని వెనుక భార‌తీయ జ‌న‌తా పార్టీ హ‌స్తం ఉందంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాగా మునుగోడులో ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని, దానిని త‌ట్టుకోలేక‌నే టీఆర్ఎస్ త‌మ‌పై రాళ్లు వేస్తోందంటూ బీజేపీ ఆరోపించారు.

ఈ మేర‌కు తమ‌కు ఎలాంటి ఈ వ్య‌వ‌హారం వెనుక ఎలాంటి ప్ర‌మేయం లేదంటూ స్ప‌ష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ద‌మ్ముంటే సీఎం కేసీఆర్ యాద‌గిరిగుట్ట‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు గుట్ట లోని శ్రీ‌లక్ష్మీ న‌ర‌సింహ్మ స్వామి ఆల‌యంలోనే ఉన్నారు.

సీఎం కేసీఆర్ భ‌య‌ప‌డే ఇక్క‌డికి రాలేద‌న్నారు. త‌మ‌కు ఈ మొత్తం వ్య‌వ‌హారంతో సంబంధం లేద‌ని స్వామి సాక్షిగా ప్ర‌మాణం చేశారు. ద‌మ్ముంటే ఈ మొత్తం సంఘ‌ట‌న‌పై సీబీఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.

ఒక వేళ కొనుగోలు చేయాల‌ని అనుకుంటే తాము ఇలాంటి చ‌వ‌క‌బారు ప‌ద్ద‌తుల‌ను అవలంబించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ కావాల‌ని నాట‌కాలు ఆడుతున్నారంటూ మండిప‌డ్డారు.

Also Read : మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఐప్యాక్ టీమ్

Leave A Reply

Your Email Id will not be published!