Prashant Kishor : ద‌మ్ముంటే హ‌రివంశ్ తో రాజీనామా చేయించు

సీఎం నితీశ్ కుమార్ కు ప్ర‌శాంత్ కిషోర్ సివాల్

Prashant Kishor : బీహార్ లో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్రంలో కొలువు తీరిన మ‌హాకూట‌మి స‌ర్కార్ ను, ప్ర‌ధానంగా సీఎం నితీశ్ కుమార్ ను ఏకి పారేస్తున్నారు. ఆయ‌న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలోతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆయ‌న మ‌న‌సు ఇంకా బీజేపీతోనే ఉంద‌ని ఆరోపించారు.

తాజాగా మ‌రో స‌వాల్ విసిరారు పీకే సీఎంకు. మీకు గ‌నుక బీజేపీతో సంబంధం లేక పోతే ఎందుకు ఇంకా రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ గా హ‌రివంశ్ ను ఉంచార‌ని ప్రశ్నించారు. దీనికి స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) డిమాండ్ చేశారు. ఇన్నాళ్లుగా ఎందుకు కోర‌డం లేద‌ని నిల‌దీశారు.

నితీశ్ కుమార్ కు ప‌ద‌వి మీద ఉన్నంత శ్ర‌ద్ద ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై లేద‌ని మండిప‌డ్డారు. లోపాయికారీగా ఎప్పుడో ఒక‌సారి మ‌ళ్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌ల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్. ఇదిలా ఉండ‌గా పీకే చేస్తున్నవ‌న్నీ ఆరోప‌ణ‌ల‌ని కొట్టి పారేశారు సీఎం నితీశ్ కుమార్.

ఆయ‌న వ‌య‌స్సులో త‌న‌కంటే చిన్న‌వాడ‌ని, అనుభ‌వం ఇంకా రాలేద‌న్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు పీకే. అనుభ‌వం లేక పోయినా త‌న‌కు అవగాహ‌న ఉంద‌న్నారు పీకే.

త‌న‌కు నితీశ్ కుమార్ స‌ర్టిఫికేట్ ఇవ్వాల్సిన ప‌ని లేద‌న్నారు. ఎవ‌రు ఏమిట‌నేది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. అయితే తాను చేసిన ఆరోప‌ణల‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

Also Read : ప్ర‌త్యేక నాగాలాండ్ డిమాండ్ త‌ప్పు కాదు

Leave A Reply

Your Email Id will not be published!