Kamiya Jani Rahul Gandhi : అమ్మాయి దొరికితే పెళ్లికి రెడీ
క్యాండిడ్ చాట్ లో కమియా జానీతో
Kamiya Jani Rahul Gandhi : మోస్ట్ పాపులర్ యూట్యూబ్ ఛానల్ క్యాండిడ్ చాట్. దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు కమియా జానీ. ఆదివారం కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పాల్గొన్నారు. కమియా జానీ రాహుల్ గాంధీతో(Kamiya Jani Rahul Gandhi) సుదీర్ఘంగా చిట్ చాట్ చేపట్టారు. రోజూ వారీ జీవన విధానం, ఆహారం, విద్య, వ్యక్తిగత సంగతులు, గతం, తన కుటుంబం గురించి పంచుకున్నారు రాహుల్ గాంధీ.
ఇద్దరి మధ్య చిట్ చాట్ అద్భుతంగా..ఆహ్లాదకరంగా సాగింది. యూట్యూబ్ లో కర్లీ టేల్స్ పేరుతో ఫుడ్ అండ్ ట్రావెల్ నడుపుతున్నారు కమియా జానీ. పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు ఇంకా ఆలోచించ లేదన్నాడు. కానీ సరైన అమ్మాయి దొరికితే తాను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశాడు రాహుల్ గాంధీ.
ఇక ఫుడ్ విషయానికి వస్తే బఠానీఈలు, జాక్ ఫ్రూట్ లు అంటే ఇష్టమని చెప్పారు. ఇక భారత్ జోడో యాత్రలో ఎలాంటి ప్రత్యేకమైన ఆహారం తీసుకోలేదన్నారు. అందరితో పాటు సాధారణ ఆహారం తీసుకుంటూ యాత్ర చేపట్టానని తెలిపారు రాహుల్ గాంధీ.
ఇప్పటి వరకు పర్యటించిన రాష్ట్రాలలో తెలంగాణలో కొంచెం కారంగా ఉంటాయని అక్కడి వంటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైదరాబాద్ బిర్యానీ ఇష్టమన్నారు. మధ్యాహ్న భోజనం దేశీయ వంటకమేనని పేర్కొన్నారు. మితమైన ఫుడ్ ను ఎక్కువగా ఇష్ట పడతానని చెప్పారు రాహుల్ గాంధీ. రెండు లేదా మూడు ఐస్ క్రీంలు తింటానని తెలిపారు.
ఇందిర హత్య కారణంగా ఇంట్లో ఉండి చదువు కోవాల్సి వచ్చిందన్నారు. మానిటర్ కంపెనీలో 2500 జీతంతో పని చేశానని చెప్పారు. ప్రధాని అయితే దేశంలో మొదటగా విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకు వస్తానని అన్నారు.
Also Read : 2024 ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పదు