US VISA Late : యుఎస్ వీసా కావాలంటే ఆగాల్సిందే
2023 జూన్ వరకు పొడిగించే ఛాన్స్
US VISA Late : ఓ వైపు ఆర్థిక మాంద్యం మరో వైపు రష్యా, ఉక్రెయిన్ యుద్దం మధ్య ప్రపంచ ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో ఇప్పటికే ట్విట్టర్ 4 వేల మందిని తొలగిస్తే ప్రముఖ సంస్థ ఫేస్ బుక్ – మెటా ఏకంగా 11 వేల మందికి మంగళం పాడింది. ఈ తరుణంలో వీసా హోల్డర్లు ఆరు నెలలో లోపు జాబ్స్ తెచ్చు కోవాల్సి ఉంటుంది.
లేక పోతే ఇక ఇంటికి రావాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే వేలాదిగా వీసాలు నిలిచి పోయాయి. ప్రాసస్ కావడానికి ఆలస్యం(US VISA Late) అవుతోంది. ఇదే సమయంలో తీవ్ర ఇబ్బందులను గుర్తించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ తో సీరియస్ గా చర్చించారు.
వెంటనే సమస్యను పరిష్కరించాలని, వీసాలు త్వరగా మంజూరు చేయాలని కోరారు. వీసాలు మంజూరు కావాలంటే ఇంకాస్త ఆలస్యం జరగనుంది. వెయిటింగ్ పీరియడ్ 2023 మధ్య నాటికి అంటే జూన్ నెలాఖరు దాకా పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా ఎంబసీ వెల్లడించింది.
యూఎస్ వీసాల కోసం వేచి ఉండే సమయం మరింత పెరగనుంది. హెచ్ , ఎల్ వర్క్ వీసాల కోసం 1,00,000 స్లాట్ లను తెరవడం ద్వారా ఇప్పటికే కొంత పురోగతి సాధించామన్నారు ఎంబసీ సీనియర్ అధికారి. ఈ ఏడాది 82,000 విద్యార్థుల వీసాలు జారీ చేశారు.
హెచ్ 1 బి, బీ-1 వ్యాపార వీసాలు, బి2తో సహా ఎల్ కేటగిరీలు వంటి వలసేతర ఉద్యోగ వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రాధాన్యత గా మారిందని పేర్కొన్నారు.
Also Read : ప్రాణాలు కాపాడిన అమృతియాకు ఛాన్స్