Twitter Blue Tick : బ్లూ టిక్ కావాలంటే రూ. 719 చెల్లించాలి
భారత్ లో మొదలైన ట్విట్టర్ సర్వీస్
Twitter Blue Tick : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశాడు. ఈ మేరకు భారతీయ యూజర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఉద్యోగులను తీసేసిన ఈ ఏక్ నిరంజన్ ఇక ఇండియన్ ట్విట్టర్ యూజర్లకు చేదు కబురు చెప్పాడు.
ఇక నుంచి ఎవరైనా తమ ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్(Twitter Blue Tick) (అధికారిక గుర్తింపు లేదా బ్యాడ్జ్ ) కావాలని అనుకుంటే విధిగా రుసుము చెల్లించాలని స్పష్టం చేశాడు. నిన్నటి వరకు కేవలం వరల్డ్ వైడ్ గా ఆరేడు దేశాలకు మాత్రమే ఉండేది.
కానీ ఇక నుంచి భారత్ లో సైతం టిక్ మార్క్ కలిగిన యూజర్లు నెలకు రూ. 719 చెల్లించాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగుల తొలగింపు, ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించడం, ఉచిత ఆహారం, వైఫై లేదని ప్రకటించడం, టాప్ ఎగ్జిక్యూటివ్ లు తొలగింపుతో ట్విట్టర్ కొత్త బాస్ అభాసు పాలవుతున్నాడు.
ఈ ఎఫెక్ట్ ట్విట్టర్ కు సంబంధించిన షేర్లపై కూడా ప్రభావం పడుతోంది. $44 బిలియన్లకు కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ ఎలాగైనా తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఇదిలా ఉండగా కోట్లాది మంది ట్విట్టర్ ను వాడుతున్నారు. టిక్ మార్క్ ఉన్న వాళ్లు ప్రముఖులు, క్రీడాకారులు, పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలకు చెందిన వారున్నారు.
ఇదిలా ఉండగా లక్షలాది మంది భారతీయ యూజర్లు టిక్ మార్క్ కలిగి ఉన్నారు. వారందరికీ కోలుకోని షాక్ తగిలింది మస్క్ తీసుకున్న నిర్ణయంతో.
Also Read : ఉద్యోగులకు నో ఫుడ్ నో వైఫై – ఎలాన్ మస్క్