UP Deputy CM : ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి మరోసారి చర్చనీయాంశంగా మారింది. 15, 17 ఏళ్ల మైనార్టీ దళిత మహిళలను అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
ఈ ఘటనలో కీలక నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రైతులను చంపిన కేసు ఇంకా నడుస్తూ ఉంది.
యూపీలో దళితులకు రక్షణ లేకుండా పోతోందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం చర్చకు దారి తీసింది. ఈ
తరుణంలో యూపీ డిప్యూటీ సీఎం(UP Deputy CM) బ్రజేష్ పాఠక్ స్పందించారు.
రేప్, మర్డర్ లో పాల్గొన్న ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇక నుంచి యూపీలో నేరం చేయాలంటే జడుసు కోవాలని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే పట్టుకుని తీరుతామన్నారు.
ఆ ఇద్దరు అవమానం తట్టుకోలేక ఊరి పక్కనే చెట్టుకు ఉరి వేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడారు. రాబోయే కాలంలో నేరాలు చేయాలంటే భయానికి లోనయ్యేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారని చెప్పారు డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండగా విపక్షాలు తీవ్రంగా తప్పు పట్టాయి. యుపీలో ప్రధానంగా దళితులపై ఎక్కువగా నేరాలు చోటు చేసుకుంటున్నాయని, అగ్ర కులాలకు చెందిన వారు ఎందుకు బాధితులు కావడం లేదని ప్రశ్నించారు బీఎస్పీ చీఫ్ మాయావతి.
సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇదే రాష్ట్రానికి సంబంధించి 2020లో హత్రాస్ లో దళిత బాలిక సామూహిక రేప్ కు గురైందని, ఆమెను సజీవ దహనం చేశారని ప్రస్తుతం రేప్ లకు యూపీ కేరాఫ్ గా మారిందని ఆరోపించారు.
వీరితో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ యూపీ సీఎం చేతకానితనం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు.
Also Read : దళిత సోదరీమణుల కేసు కలకలం