Elon Musk : నేనేమీ పిచ్చోడిని కాదు – ఎలాన్ మస్క్
పనికి రాని వాళ్లు అవసరం లేదు
Elon Musk : ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొంత కాలం నుంచి ట్విట్టర్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రధానంగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు మస్క్. అంతే కాదు పర్మినెంట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. 4 వేల మందిని తొలగించాడు. కాంట్రాక్టు కింద పని చేస్తున్న 5 వేల మందిని సాగనంపాడు.
ఇదే సమయంలో ట్విట్టర్ లో ఇక ఉండలేమంటూ 1,200 మంది గుడ్ బై చెప్పారు. అంతే కాదు ట్విట్టర్ కు సమాధి కూడా కట్టేశారు. అయినా ఎలాన్ మస్క్ ఎక్కడా తల వంచ లేదు. కాస్ట్ కటింగ్ లో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు.
ఇదే సమయంలో ఎలాన్ మస్క్(Elon Musk) కు ఏమైందని ఎందుకిలా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ టెక్ నిపుణులు తెగ మండి పడుతున్నారు.
ఇదిలా ఉండగా వ్యాపారవేత్తలు మాత్రం ఇదంతా వ్యూహంలో ఒక భాగమని పేర్కొంటున్నారు. మరో వైపు నిర్దాక్షిణ్యంగా మహిళలు అని చూడకుండా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో నవంబర్ 29న ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ను అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు ఎలాన్ మస్క్. తాజాగా ఈ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపి వేసినట్లు పేర్కొన్నారు. కాగా ట్విట్టర్ బ్లూ ప్రక్రియతో ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికీ పూర్తి నమ్మకం వచ్చేలా దానిని తిరిగి రీ లాంచ్ చేస్తామని ప్రకటించారు ట్విట్టర్ బాస్.
Also Read : ఖర్చు చేస్తే ప్రమాదం దాచుకుంటే లాభం