IMF Chief : శ్రీ‌లంక‌కు సాయంపై భార‌త్ కు ప్ర‌శంస

మెచ్చుకున్న ప్ర‌పంచ ద్ర‌వ్య‌నిధి సంస్థ

IMF Chief : ప్ర‌పంచ ద్ర‌వ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సంచ‌ల‌న కామెంట్స్ చేసింది భార‌త్ పై. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతూ ప‌త‌నం అంచున ఉన్న శ్రీ‌లంక‌ను గ‌ట్టెక్కించేందుకు భార‌త్ చేసిన స‌హాయం గొప్ప‌ద‌ని ప్ర‌శంసించింది ఐఎంఎఫ్‌.

ఆహారం, ఇంధ‌న కొర‌త‌, పెరుగుతున్న ధ‌ర‌లు, విద్యుత్ కోత‌లు శ్రీ‌లంక‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. ఇప్ప‌టికీ ఆక‌లి కేక‌లు, ఆర్త నాదాల‌తో అట్టుడుకుంతోంది ఆ దేశం. దీనిని గుర్తించిన భార‌త ప్ర‌భుత్వం తోచినంత సాయం చేసింది.

ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ లో అంత‌ర్గ‌త సంక్షోభం నెల‌కొంది. 1948 త‌ర్వాత కొన్నేళ్ల త‌ర్వాత అత్యంత విప‌త్క‌ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది శ్రీ‌లంక‌. ఇప్ప‌టికే ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. ప్ర‌ముఖ క్రికెట‌ర్లు సైతం ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

దేశ వ్యాప్తంగా భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ త‌రుణంలో ఇవాళ ఐఎంఎఫ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధానంగా స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భార‌త దేశం త‌ర‌పు నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతార‌మ‌న్ హాజ‌ర‌య్యారు.

ఐఎంఎఫ్ చీఫ్ (IMF Chief)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మయంలో మాన‌వ‌తా దృక్ఫ‌థంతో శ్రీ‌లంక‌ను ఆదుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొంది ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా.

ఇదే స‌మ‌యంలో శ్రీ‌లంక‌ను ఆదుకునేందుకు తాము ముందుంటామ‌ని స్ప‌ష్టం చేశారు ఆర్థిక మంత్రి సీతారామ‌న్. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల భౌగోళిక రాజ‌కీయ ప‌రిణామాల‌ను చ‌ర్చించారు.

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై దాని ప్ర‌భావం , పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లతో ముడిప‌డి ఉ్న స‌వాళ్ల గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Also Read : నేను ఏ దేశానికి వ్య‌తిరేకం కాదు – ఇమ్రాన్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!