Imran Khan : పాకిస్తాన్ ప్రధాన మంత్రి , మాజీ పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయనపై విపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన పార్టీలు సైతం కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి.
దీంతో పీఎం పదవి ఉంటుందో లేదో నన్న ఉత్కంఠ పాకిస్తాన్ లో నెలకొంది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ భారత ఆర్మీని, విదేశాంగ విధానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆర్మీ జోక్యం చేసుకోరని, ఫారిన్ పాలసీ బాగుందని కితాబు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)మీడియాతో మాట్లాడారు. మీరు ఓడిపోతున్నారట కదా అన్న ప్రశ్నకు షాక్ ఇచ్చారు.
ఎన్ని అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టినా అంతిమ విజయం తనదేనని స్పష్టం చేశారు. కుట్రలకు భయపడనని, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
చివరలో తాను విపక్షాలకు షాక్ ఇస్తానని చూస్తూ ఉండడంని చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం పాకిస్తాన్ ప్రధాని అవిశ్వాస తీర్మానం ఎదుర్కో బోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందోనని ఇతర దేశాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఇప్పటికే పాకిస్తాన్ పీకల లోతు అప్పుల్లో కూరుకు పోయింది. విపక్షాలు తన వద్ద అస్త్రాలు ఉన్నాయని మరిచి పోయింది. చివరలో వాటిని తీసుకు వస్తానని అన్నారు.
నా వ్యూహాలు కనుక్కోవడం ఎవరి తరం కాదన్నారు ఇమ్రాన్ ఖాన్. కాగా విపక్షాలను దొంగలు అంటూ సంబోధించడం కలకలం రేపింది.
Also Read : పుతిన్ పై బైడెన్ కన్నెర్ర