Imran Khan : నిన్నటి దాకా తను దిగి పోయేందుకు విదేశీ కుట్ర జరిగిందని, దాని వెనుక ప్రధానంగా అమెరికా ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టుండి మాట మార్చారు.
తాను ఏ దేశానికి వ్యతిరేకం కాదన్నాడు. తాను ఇండియాకు కానీ అమెరికాకు కానీ వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశాడు. నేను భారత్ కు యూరప్ కు లేదా యుఎస్ వ్యతిరేకినని కొందరు ప్రచారం చేస్తున్నారు.
అదంతా అబద్దం. నేను అసలు సిసలైన మానవతా వాదిని అని స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). అంతే కాదు అన్ని వర్గాలు తనకు సమానమేనని చెప్పారు. యాంటీ ఇండియా యాంటీ యుఎస్ అన్నది తన పదంలో లేదన్నారు.
పనిలో పనిగా ఆయన మరోసారి గుర్తు చేశారు. భారత దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం గొప్పగా ఉందన్నారు మాజీ పీఎం. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మన్ గా ఉన్న ఈ మాజీ దేశ కెప్టెన్ ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారు.
విదేశీ కుట్ర లేఖపై స్పందించారు. స్వరం మార్చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో సత్ సంబంధాలు కలిగి ఉండేందుకు తాను ప్రయారిటీ ఇచ్చానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
కరాచీలో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ వేదికలపై ఆయన పీఎంగా ఉన్న సమయంలో భారత్ ను విమర్శిస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా పాశ్చాత్య దేశాల ప్రభావానికి లోను కాకుండా దేశ విదేశాంగ విధానాన్ని రూపొందించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు అబద్దం