Imran Khan : భార‌త విదేశాంగ విధానం భేష్

మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ కితాబు

Imran Khan : ఇంధ‌న ధ‌ర‌ల త‌గ్గింపు త‌ర్వాత భార‌త దేశం అనుస‌రిస్తున్న విదేశాంగ విధానాన్ని మ‌రోసారి ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నియాజీ.

ప‌నిలో ప‌నిగా త‌న‌ను కుట్ర పూరితంగా దించేసి కొలువు తీరిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఆర్థిక వ్య‌వ‌స్థ‌త‌తో త‌ల లేని కోడిలా న‌డుస్తోందంటూ ఎద్దేవా చేశారు.

పాకిస్తాన్ కు చెందిన మీర్ జాఫ‌ర్లు, మీర్ సాదిక్ లు బాహ్య ఒత్తిడి (అమెరికా, యూకే) కి త‌లొగ్గారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా యుఎస్ ఒత్తిడికి త‌లొగ్గ‌కుండా ర‌ష్యా నుంచి రాయితీపై చ‌మురు కొనుగోలు చేసినందుకు భార‌త్ ను ప్ర‌శంసించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).

త‌మ ప్ర‌భుత్వం కూడా స్వ‌తంత్ర విదేశాంగ విధానం సాయంతో అదే ప‌నిలో ప‌డుతోంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా వినియోగ‌దారుల‌పై భారం ప‌డ‌కుండా ఉండేందుకు గాను భార‌త ప్ర‌భుత్వం పెట్రోల్ లీట‌ర్ పై రూ. 9.5 , డీజిల్ పై ఊ. 7 చొప్పున త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

క్వాడ్ లో భాగ‌మైన‌ప్ప‌టికీ భార‌త దేశం యుఎస్ నుండి తీవ్ర‌మైన ఒత్తిడి ఎదుర్కొంది. అయితే ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు ర‌ష్య‌న్ చ‌మురును రాయితీతో కొనుగోలు చేయ‌డం మంచి నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).

ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని పాల‌కులు న‌డిపించ‌డం లేద‌ని ఆరోపించాడు. ఈ దేశాన్ని కొన్ని దుష్ట శ‌క్తులు, అవినీతి, అక్ర‌మార్కుల‌కు పేరొందిన వారు ఇప్పుడు కొలువు తీర‌డం బాధాక‌ర‌మ‌న్నారు ఇమ్రాన్ ఖాన్.

Also Read : ఆస్ట్రేలియా ఎన్నిక‌ల్లో మారిస‌న్ ఓట‌మి

Leave A Reply

Your Email Id will not be published!