Imran Khan ; పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 3కు వాయిదా పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చివరి బంతి వరకు పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. తనను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా దేశం కోసం చని పోయేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆయన అమెరికాను టార్గెట్ చేశారు. తనను దించేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు.
విదేశీ శక్తులు దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ఇంటెలిజెన్సీ విభాగం తనకు ప్రాణ హాని ఉందంటూ హెచ్చరించిందని తెలిపారు.
దీంతో తాను దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడాన్ని రద్దు చేసుకున్నానని చెప్పారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). తన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
ఒకటి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం. రెండు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. మూడు ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడం ఉందన్నారు ఇమ్రాన్ ఖాన్.
తన ప్రాణం ప్రమాదంలో ఉందని, హుస్సేన్ హక్కానీ వంటి వ్యక్తులు లండన్ లో నవాజ్ షరీఫ్ ను కలుస్తున్నారంటూ కీలక కామెంట్స్ చేశారు పీఎం.
అయితే తాను భయపడేది లేదని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం సాగిస్తానని ప్రకటించారు. నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉందని నా దేశానికి తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇమ్రాన్ ఖాన్.
వారు ప్లాన్ చేసింది పక్కా. నాతో పాటు నా భార్యను కూడా చంపాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
Also Read : కుట్ర నిజం నేనే సుప్రీం – ఇమ్రాన్ ఖాన్