Imran Khan : రాజకీయ స్థిరత్వం అభివృద్దికి సోపానం
తమ విధానాలపై సైన్యం సమీక్షించాలి
Imran Khan : ప్రభుత్వంతో గొడవల మధ్య పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పవర్ లో ఉన్న సమయంలో దేశంలో తీసుకున్న విధానాలపై సైన్యం బేషరతుగా సమీక్ష జరపవచ్చని సూచించాడు.
ఇందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఇస్లామాబాద్ లో జరిగిన ఒక సెమినార్ లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆర్థిక అభివృద్దికి రాజకీయ సుస్థిరత అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
స్వేచ్చగా, నిష్పక్ష పాతంగా ఎన్నికలు లేకుండా అభివృద్ది సాధ్యం కాదన్నారు. పాకిస్తాన్ బనానా రిపబ్లిక్ గా అవతరిస్తోందంటూ ఆరోపించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అంగీకరించే బదులు తాను మరణానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
తాను అనుసరించిన విధానాలు ఇప్పటికీ సరైనవేనని నమ్ముతున్నానని అన్నారు. పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ పాలక కూటమితో యుద్దంలో చిక్కుకున్నందున ఈ హెచ్చరిక వచ్చింది.
అమెరికా మద్దతుతో కుట్ర ఫలితంగా అధికారంలోకి వచ్చాడంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. నేను ఇవాళ తటస్థులను అడగాలని అనుకుంటున్నా. దేశం ఎటు వైపు వెళుతోందో మీకు తెలుసా అని ప్రశ్నించారు.
రాబోయే రెండు మూడు నెలల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని సమయంలో దేశం , ఆర్థిక వ్యవస్థ ఎలా పురోగమిస్తుందని నిలదీశారు ఇమ్రాన్ ఖాన్.
పాకిస్తాన్ సైన్యం పట్ల అభిమానం కోల్పోయిన మాజీ ప్రధానమంత్రి(Imran Khan) దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి సరైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : 36 గంటల పర్యటన రూ. 38 లక్షల ఖర్చు