Imran Khan : విపక్షాలు దేశాన్ని దోచుకున్న జ‌ల‌గ‌లు

పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్

Imran Khan  : విప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. 30 ఏళ్లుగా పాకిస్తాన్ ను దోచుకున్న దొంగ‌లు మీరంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వాళ్ల‌ను ఎలుక‌ల‌తో పోల్చారు పీఎం. ఇస్లామాబాద్ లో జ‌రిగిన ప‌వ‌ర్ షోలో ప్ర‌సంగించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan ). అవిశ్వాస తీర్మానంపై ఓట్ల‌కు ప్ర‌తిగా ప్ర‌తిప‌క్షాలు ఇచ్చిన లంచాల‌ను తిర‌స్క‌రించిన త‌న పార్టీకి చెందిన శాస‌న స‌భ్యుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

తాను అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విప‌క్షాలు కావాలని టార్గెట్ చేశాయంటూ మండిప‌డ్డారు. త‌న‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని కానీ దానిని తాను అడ్డుకున్నాన‌ని చెప్పారు.

ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ అవిశ్వాసానికి ముందు పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్(Imran Khan )ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై నిప్పులు చెరిగారు.

కొన్నేళ్ల నుంచి దోచుకుంటూనే ఉన్నార‌ని ఇంకెంత కాలం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారంటూ మండిప‌డ్డారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాజ‌కీయ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఇమ్రాన్ ఖాన్.

ఇవాళ త‌మ స‌భ్యుల‌ను చూసి గ‌ర్వ ప‌డుతున్నాన‌ని అన్నారు. ఈ జ‌ల‌గ‌లు దేశాన్ని, ప్ర‌జ‌ల ర‌క్తాన్ని పీల్చుకు తింటున్నాయంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. దేశం వెలుప‌ల ల‌క్ష‌లాది ఆస్తులు కూడ‌బెట్టారంటూ మండిప‌డ్డారు.

ముషార‌ఫ్ లాగానే తాను కూడా వారి ముందు మోకరిల్లాల‌ని అనుకుంటున్నార‌ని కాని అది జ‌ర‌గ‌ద‌న్నారు. త‌న‌పై కుట్ర జ‌రిగింద‌ని దానిని దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు ఇమ్రాన్ ఖాన్.

Also Read : పాకిస్తాన్ అసెంబ్లీ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!