Farah Khan : ఇమ్రాన్ భార్య ఫ్రెండ్ కు ఖాకీల కాపలా
విచారణకు ఆదేశించిన పాకిస్తాన్ సర్కార్
Farah Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడుతున్నట్లే కనిపిస్తోంది. తన పదవిని కోల్పోయే కంటే ముందు మాజీ పీఎం భార్య బుష్రా బీబీ సహాయకురాలిగా ఉన్న ఫరా ఖాన్(Farah Khan) వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది.
ఆమెను సేవ్ చేసేందుకు భారీ ఎత్తున సెక్యూరిటీ కల్పించారు. ఫరా ఖాన్(Farah Khan) నివాసానికి 24 గంటల పాటు రక్షణ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సిబ్బందికి ఎనిమిది గంటల చొప్పున మూడు షిప్టులలో పని చేయాలని చెప్పారు.
ఒక్కో షిప్టుకు నలుగురు పోలీసులను నియమించారు. కేవలం ఆమె ఒక్కరి కోసం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 12 మంది పోలీసులను, మూడు వాహనాలను భద్రతకు అంకితం చేశారు.
2018లో మాజీ క్రికెటర్, రాజకీయ వేత్త ప్రధాన మంత్రిగా ఎన్నికైన వెంటనే పాకిస్తాన్ పంజాబ్ పోలీస్ ఆమె నివాసం వెలుపల సెక్యూరిటీ కల్పించారంటూ పాక్ వెబ్ సైట్ జియో న్యూస్ కథనం వెలువరించింది.
ఇమ్రాన్ ఖాన్ పాలనా కాలంలో ఎలాంటి హోదా లేనటువంటి ఫరా ఖాన్ కు భద్రత కల్పించారంటూ పేర్కొంది. లాహోర్ లోని ఉన్నత స్థాయి డిఫెన్స్ ఏరియాలో తన ఇంటి వెలుపుల పోలీసులు మోహరించినట్లు తెలిపింది.
పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అయేషా బట్ ఆదేశాల మేరకు బుష్రా బీబీ స్నేహితురాలికి భద్రత కల్పించినట్లు మరో పోలీసు పేర్కొన్నాడు. అయితే ఖాన్ కు భద్రత కల్పిస్తున్ విషయం తనకు తెలియదని దాటవేశాడు.
ఫరా ఖాన్(Farah Khan) వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుత ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీని రద్దుచేసిన రోజునే ఆమె పాకిస్తాన్ నుంచి దుబాయ్ కు బయలు దేరింది.
Also Read : శ్రీలంకలో అత్యవసర పరిస్థితి