Lalan Singh : 2024లో బీజేపీ ముక్త్ భార‌త్ ఖాయం

జేడీయూ చీఫ్ లాల‌న్ సింగ్ కామెంట్స్

Lalan Singh : సీఎం నితీశ్ కుమార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు జేడీయూ చీఫ్ లాల‌న్ సింగ్.

ఎవ‌రు ఎవ‌రిని మోసం చేశారో, వెన్ను పోటు పొడిచేందుకు ప్ర‌య‌త్నం చేశారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. త‌మ పార్టీకి అమిత్ షా స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు లాల‌న్ సింగ్(Lalan Singh).

దేశంలో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో కూల్చి వేసిన ఘ‌న‌త బీజేపీది కాదా అని ప్ర‌శ్నించారు. 2024లో బీజేపీ ముక్త్ భార‌త్ చేసేందుకు బీహార్ కేంద్రంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు.

అమిత్ షా కుట్ర ప‌న్నుతున్న విష‌యాన్ని తాము ముందే గుర్తించామ‌ని అందుకే 17 ఏళ్ల బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచు కోవాల్సి వ‌చ్చింద‌న్నారు. మిత్ర ధ‌ర్మాన్ని విస్మ‌రించి వెన్నుపోటు పొడించేందుకు ట్రై చేసిన అమిత్ షా దీనికి పూర్తి బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

త‌మ‌పై మాట్లాడే హ‌క్కు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాకు లేద‌ని స్ప‌ష్టం చేశారు లాల‌న్ సింగ్(Lalan Singh). బీజేపీ ఎన్ని ర్యాలీలు చేసినా లేదా ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా రాష్ట్రంలో ఆ పార్టీకి అంత సీన లేద‌ని మండిప‌డ్డారు.

కేంద్ర హొం శాఖ మంత్రి ప‌ని దేశాన్ని ర‌క్షించ‌డం కాకుండా బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను, వ్య‌క్తుల‌ను, నేత‌ల‌ను, సంస్థ‌ల‌ను టార్గెట్ చేయ‌డం త‌ప్ప మ‌రో ప‌ని లేద‌ని ఎద్దేవా చేశారు లాల‌న్ సింగ్.

క‌ర్ణాట‌క మాజీ సీఎం, బీజేపీ నాయ‌కుడు బీఎస్ య‌డియూర‌ప్ప‌పై కోర్టు ప్ర‌తికూల వ్యాఖ్య‌లు చేసింద‌ని సీబీఐ లేదా ఇత‌ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని నిల‌దీశారు జేడీయూ చీఫ్(Lalan Singh).

Also Read : న‌రేంద్ర మోదీ ప‌నితీరు సూప‌ర్ – వెంక‌య్య

Leave A Reply

Your Email Id will not be published!