BJP : భారతీయ జనతా పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రవక్తపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ తరుణంలో డ్యామేజ్ కలగకుండా ఉండేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ఈ మేరకు స్పందించింది.
బీజేపీ(BJP) కి అన్ని మతాలు ఒక్కటేనని పేర్కొంది. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తర తరాలుగా అన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిసే ఉంటున్నాయని భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారత దేశం ముఖ్య లక్షణమని తెలిపింది బీజేపీ.
భారతీయ సంస్కృతి, నాగరికత ఒక్కటేనని, ఇందులో ఈ దేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులేనని వెల్లడించింది. ఇదిలా ఉండగా యూపీ పార్టీ స్పోక్స్ పర్సన్ నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై నోరు పారేసుకున్నారు.
దీంతో కాన్పూర్ లో కలకలం రేగింది. గత శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.
దేశ వ్యాప్తంగా నుపుర్ శర్మ తో పాటు బీజేపీపై ఇతర వర్గాలు తీవ్రంగా మండి పడుతుండడంతో ఆదివారం బీజేపీ(BJP) రంగంలోకి దిగింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. అంతా ఒక్కటేనని నమ్ముతుంది. మనమంతా భారతీయులం. మనది భారత దేశం.
ఈ సమున్నత దేశంలో ప్రతి ఒక్కరు తమ భావాలను , అభిప్రాయాలను , ఆలోచనలను తెలియ చేసుకునే హక్కు ఉంటుందన్నది గుర్తించాలని మరికొందరు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మోహరించారు.
Also Read : పీపీఇ కిట్ వ్యవహారం సీఎం ఆగ్రహం