TS Secretariat Postponed : సచివాలయం ప్రారంభం వాయిదా
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
TS Secretariat Postponed : భారీ ఖర్చుతో అత్యాధునికంగా పునర్ నిర్మించిన తెలంగాణ సచివాలయంకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కోట్లాది రూపాయలతో నిర్మించిన అందమైన సచివాలయ భవనాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇందుకు పండితులు, పీఠాధిపతులు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. సీఎంకు భక్తి ఎక్కువ. వారిని సంప్రదించకుండా ఏ పనీ చేయడు. వాస్తు బాగా లేదనే పేరుతో ఇప్పటికే ఉన్న తెలంగాణ సెక్రటేరియట్ ను కూల్చి వేశాడు. ఆపై పునర్ నిర్మాణానికి మొదట నిర్దేశించిన బడ్జెట్ కంటే రాను రాను అంచనా పెరుగుతూ పోయింది.
ఇదే క్రమంలో ప్రారంభించేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. దీంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా(TS Secretariat Postponed) వేయక తప్పలేదు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఎప్పుడు ప్రారంభిస్తామనే దానిపై తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది .
ఇదిలా ఉండగా ప్రారంభోత్సవానికి సంబంధించి ముందస్తుగా భారీగానే ఏర్పాట్లు చేసింది. ఈ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను చేపట్టాలని డిసైడ్ చేశారు.
ఈ సభకు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో సీఎంలు స్టాలిన్ , సోరేన్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఉన్నారు.
Also Read : వీడియో రికార్డు ఎంపీ సస్పెండ్