Indonesia Clash : ఫుట్ బాల్ మ్యాచ్ లో పెరిగిన మృతుల సంఖ్య
180 మందికి పైగా పెరిగిన బాధితుల సంఖ్య
Indonesia Clash : ప్రపంచ క్రీడా రంగంలో అత్యంత విషాదకరమైన ఘటన ఇది. ఇండోనేషియా(Indonesia Clash) ఫుట్ బాల్ మ్యాచ్ తొక్కిసలాటలో మరణాల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు కడపటి వార్తలు అందేసరికి మృతుల సంఖ్య 174 కి చేరింది. తూర్పు నగరమైన మలాంగ్ లో నిన్న రాత్రి జరిగిన విషాదం ఇది.
ఈ ఘటనలో 180 మందికి పైగా గాయపడ్డారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఘోరమైన క్రీడా స్టేడియం విపత్తులలో ఇది ఒకటి. చాలా మంది బాధితులు ఊపిరి ఆడక , కొంత మంది తొక్కిసలాటలో దారి తెలియక ప్రాణాలు కోల్పోయారు. కోపంతో వేలాది మంది అభిమానులు పిచ్ పైకి చొరబడ్డారు.
పోలిసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉదయం 9.30 గంటలకు మరణించిన వారి సంఖ్య 158 ఉండగా గంట తర్వాత 174కి చేరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు జావా డిప్యూటీ గవర్నర్ ఎమిల్ డార్టాక్ బ్రాడ్ కాస్టర్ కొంపస్ చెప్పారు. ఇది ప్రపంచంలో అత్యంత ఘోరమైన క్రీడా స్టేడియం విపత్తులలో ఒకటిగా మిగిలింది.
అశాంతిని అల్లర్లుగా అభివర్ణించారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులను చంపారు. అభిమానులను స్టాండ్ లకు తిరిగి రావాలని , బాష్ఫవాయువు ప్రయోగించేందుకు ప్రయత్నించారని చెప్పారు.
బాధితుల సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తమపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కిక్కిరిసిన గుంపులో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రాణాలతో బయపడిన వారు చెప్పారు.
ఏమీ జరగలేదు. అల్లర్లు చోటు చేసుకోలేదు. కానీ వారు అకస్మాత్తుగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదే తనను షాక్ కు గురి చేసింది. కానీ పిల్లలు, మహిళల గురించి ఆలోచించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read : ఆసియా కప్ లో భారత్ శుభారంభం